మొన్న కర్ణాటక కి సంబంధించి ఏదైతే షెడ్యూల్ రిలీజ్ అయిందో దానిపై ప్రీపోల్ సర్వేలు వస్తున్నాయి. అందులో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందని ఏబీపీ సర్వే, బిజెపికి ఉందని జి న్యూస్ సర్వే చెప్తున్నాయి. ఏబీపీ సర్వేలో 115-127స్థానాలలో కాంగ్రెస్ అధికారానికి వస్తుందని, బిజెపి 68 - 80స్థానాలతో ప్రతిపక్షానికి పరిమితం అవుతుందని, కుమార స్వామి నేతృత్వంలో జెడిఎస్ 25 - 30 స్థానాలు గెలవబోతుందని ప్రకటించింది.


అంటే దాదాపుగా 224 స్థానాల్లో 115- 127అంటే ఫుల్ మెజారిటీ వచ్చేసినట్టే. 31 స్థానాల్లో హైదరాబాద్, కర్ణాటకలో కాంగ్రెస్ 19- 23, బీజేపీ 18-12గెలుచుకుంటాయని, 50 స్థానాల్లో ముంబై, కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్, బిజెపి మధ్య హోరా హోరీ ఉంటుందని కాంగ్రెస్ 25- 29, బిజెపి 21- 25 గెలుచుకుంటాయని, 21 స్థానాల కోస్తా ప్రాంతంలో కాంగ్రెస్- బిజెపిల హరాహోరి పోరు సాగుతుందని సర్వే చెప్తుంది.


అక్కడ బీజేపీ 9-13కాంగ్రెస్ పార్టీ 8- 12 గెలుస్తాయని, బిజెపికి కంచుకోటగా పేర్కొనే 35 స్థానాల సెంట్రల్ కర్ణాటకలో కాంగ్రెస్-బిజెపి పోరు తప్పదని సర్వే చెప్తుంది. ఈ ప్రాంతంలో 12-16 కాంగ్రెస్, 18-22 బిజెపి, జెడిఎస్ 2స్థానాలకు పైబడి విజయం సాధించే అవకాశం ఉందని, పాత మైసూర్ ప్రాంతంలో జెడిఎస్ తో పాటు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తున్నట్లుగా సర్వే స్పష్టం చేసింది.


మొత్తం 55 స్థానాలు ఉన్న పాత మైసూర్ ప్రాంతంలో జెడిఎస్ 26- 27, కాంగ్రెస్ 24- 28, బిజెపి 1-5స్థానాలు గెలిచే అవకాశం ఉందని, గ్రేటర్ బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో ఉండబోతున్నట్టు సర్వే చెప్తుంది. బిజెపి 11-15, కాంగ్రెస్ పార్టీ 15-19స్థానాలు దక్కించుకునేటువంటి అవకాశం ఉందని అయితే సీఎంకే మాత్రం సిద్ధరామయ్య రావాలని కోరుకుంటున్నారని ఏబీపి సర్వే చెప్తుంది. అదే సందర్భంలో జి వచ్చేటప్పటికి హాంగ్ వస్తుందని, బిజెపికి 98-122 వరకు వచ్చే అవకాశం ఉందని జి న్యూస్ చెప్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: