చైనా గతంలో డోక్లామ్ ప్రాంతం, గాల్వన్ లోయ లో భారత సరిహద్దుల్లోకి చొచ్చుకురావడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భారత సైన్యం, చైనా సైన్యం పరస్పరం దాడులు చేసుకున్నాయి. భారత సైనికులు 20 మంది వరకు అమరులయ్యారు. కరోనా ఎక్కువ ఉన్న సమయంలో గాల్వాన్ లోయలో చైనా కావాలనే ఇండియా భూభాగంలోకి రావడానికి ప్రయత్నిస్తే త్రివిధ దళాలను కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంతంలో మోహరించింది.


గాల్వాన్ లోయ, లడక్ లాంటి ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేనంత సైన్యంతో కాపలా కాస్తున్నారు. దాదాపు 15 వేల నుంచి 20 వేల వరకు ఉండాల్సిన సైన్యం, ప్రస్తుతం అది సమస్యత్మాక ప్రాంతంగా ఉందని 70 నుంచి 80 వేల వరకు ఉన్నారు. కానీ ఇవేవీ దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు, రాహుల్ గాంధీకి కనిపించడం లేదు.


లడక్ కు వచ్చి ఇండియా భూభాగాలను చైనా ఆక్రమించుకుంటుంటే నరేంద్ర మోదీ నిద్రపోతున్నాడని రాహుల్ గాంధీ విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి  ఏ విషయం అయినా తెలియకపోతే తెలుసుకుని మాట్లాడాలి. కానీ తెలిసిన తెలియదన్నట్లు మాట్లాడితే ఎవరూ ఏమీ చేయలేరు. లడక్, గాల్వాన్ లోయలో భారత ప్రభుత్వం చైనా ను ధీటుగా ఎదుర్కొనేందుకు సైన్యాన్ని పంపింది.


ఆ విషయం గురించి రాహుల్ తెలుసుకుని మాట్లాడాలని.. ఏది పడితే అది మాట్లాడటం సమంజసం కాదని జైశంకర్ అన్నారు. ఒక్క గజం భూభాగాన్ని కూడా భారత్  పోగొట్టుకోలేదు  అని జై శంకర్ అన్నారు. కానీ అదే చైనా మా భూభాగంలో కి భారత్ చొరబడుతోందని ఆరోపణలు చేస్తుంది.  ఈ మాత్రం కూడా రాహుల్ కు తెలియడం లేదా అని ఎద్దేవా చేశారు. ఏదేమైనా భారత్, చైనాను  సరిగా ఎదుర్కోలేక పోతుందన్నది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ప్రధాన ఆరోపణ.

మరింత సమాచారం తెలుసుకోండి: