
ప్రస్తుతం కాశ్మీర్ లో కూడా కేంద్ర ప్రభుత్వం బుల్డోజర్లను సైన్యానికి అందజేయనుంది. అవి మామూలు బుల్డోజర్లు కావు. ఆయుధాలతో నిండి ఉంటాయి. గతంలో ఉగ్రవాదులు దాక్కున్న ఇంటిని పేల్చేయాలంటే దానికి సంబంధించి బాంబులు పెట్టేవారు. లేకపోతే సైనికులు నేరుగా పోరాడేవారు. కానీ ఇప్పుడు కేంద్రం సరికొత్త ప్లాన్ కు శ్రీకారం చుట్టింది. సైన్యానికి మొత్తం మీద బుల్డోజర్లు ఇచ్చేయాలని నిర్ణయం తీసుకుంది.
జమ్మూ కాశ్మీర్ పోలీసులకు, సైన్యానికి ఈ ఆయుధ బుల్డోజర్లు ఇచ్చేందుకు కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హై సెక్యూరిటీ సిస్టమ్ ఉన్న వీటిని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఆర్మ్ డ్ వెహికల్స్ కొనేందుకు పెద్ద ఎత్తున నిధులను కూడా మంజూరు చేసింది. ఈ బుల్డోజర్లతో సైనికుల ప్రాణాలు పోకుండా ఉంటాయి. అదే సమయంలో శత్రువులు చేసే దాడి నుంచి తప్పించుకోవచ్చు.
శత్రు సైన్యం చేసే దాడి నుంచి సైన్యానికి రక్షణగా ఉంటాయి. ఇప్పటి వరకు బుల్డోజర్లు అంటే మట్టిని తీసేందుకు, చదును చేసేందుకు ఉపయోగించే వారు. కానీ కాలం మారింది. వాటిని వాడే తీరు మారుతోంది. దీన్ని మొదటి గుర్తించింది యోగి ఆదిత్యనాథ్ అని చెప్పొచ్చు. రౌడీయిజం చేయడానికే భయపడేలా చేశాడు. దీన్ని గుర్తించిన కేంద్రం కూడాా ఇదేదో బాగుందని ఏకంగా కాశ్మీర్ లోనే ప్రవేశపెడుతోంది.