
ప్రపంచంలో ఎక్కువగా క్రూడాయిల్ ఉత్పత్తి అయ్యే దేశాల్లో సౌదీ కూడా ఒకటి. ప్రపంచ దేశాలకు ఎక్కువగా ఆయిల్ ను ఎగుమతి చేస్తూ సంపన్న దేశంగా విరాజిల్లుతోంది. ఇలాంటి దేశంలో అమెరికా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. ఏ విధంగా ముందడుగు వేస్తుందనేది చూడాలి. అయితే ఉక్రెయిన్ కు మద్దతు ఇచ్చి ఆయుధాలు సరఫరా చేస్తున్న అమెరికా రష్యాపై ఉక్రెయిన్ ను గెలిపించుకోలేక నానా తంటాలు పడుతోంది. దీంతో విసుగు చెందిన యూరప్ దేశాలు సైతం ఆయిల్ ను దొంగ చాటుగా కొనడం ప్రారంభించాయి.
ఇప్పటి వరకు గ్యాస్ ను మాత్రం రష్యా నుంచే కొనుగోలు చేస్తున్నాయి. ఒపెక్ దేశాలు కూడా అమెరికా మాటను పెడచెవిన పెట్టడంతో ఏం చేయాలో తోచని పరిస్థితి అగ్రరాజ్యానిది. ఈ మధ్య సౌదీ, చైనా, రష్యా, ఉత్తర కొరియా నాలుగు దేశాలు మాస్కోలో సమావేశమయ్యాయి. మాస్కో లో జరిగిన సమావేశం సంబంధించి అమెరికా గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. సౌదీ ఆయిల్ ఇవ్వనని చెప్పడం, రష్యా యుద్ధ నౌక ఏకంగా సౌదీ కి రావడం అమెరికాకు ఆందోళన కలిగించే విషయాలే.