
కానీ పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేసేసుకుని అప్పుడు పొత్తులు పెట్టుకోవడంలో నష్టమేమీ ఉండదు. ఎప్పుడు పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేసుకోవడం లేదో అప్పుడు పొత్తులను ముందుగా అనౌన్స్ చేసుకుంటే ఆయన నియోజకవర్గం లో నైనా కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇదే ఎవరైనా ఆయన శ్రేయోభిలాషులు చెప్పేటువంటి విషయం.
ఇకపోతే అసెంబ్లీ సీటు విషయంలో కిందటిసారి గాజువాక, భీమవరం రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. ఓటమి పాలయ్యారు. ఎందుకంటే చిట్టచివరి లోనే నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కేడర్ అక్కడ నుంచి పనిచేశారు, ఎన్నారైలు పరిగెట్టుకుంటూ వచ్చి పని చేశారు. అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉంది. దాని ఇంపాక్ట్ అయితే అప్పుడు ఫేస్ చేశారు.
ఇప్పుడు చంద్రబాబు గారు కుప్పం నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతుండగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పులివెందుల నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. చంద్రబాబు ఎప్పటినుండో కుప్పంలో గ్రౌండ్ టీం ని ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రకంగా సిద్ధంగానే ఉన్నారు. ఇలాంటప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్న దానిపై ఒక క్లారిటీ కి రావాలని అందరూ అనుకుంటున్నారు. లేదా తన పార్టీ వాళ్లకైనా చెప్పి అక్కడ తన గ్రౌండ్ టీం ని ఏర్పాటు చేసుకుంటే బెటర్ అని జనసేన ఇంకా పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.