భారత్ ను ఓడించి, కాశ్మీర్ ను స్వాధీనం చేసుకుంటామని గతంలో పాక్ కోతలు కోసేది. అవన్నీ ఒకప్పటి మాటలు. ప్రస్తుతం కాలం మారింది. పాక్ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. దీనికి తోడు భారత్ పాక్ కు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. అదే ఇండస్ జలాలకు సంబంధించి 60 ఏళ్లు ఒప్పందం అయిపోయింది. దీంతో మా దేశంలో మేము సింధు నదిపై ప్రాజెక్టులు కట్టుకుంటామని ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పాక్ కు తెగేసీ చెప్పేసింది.


దీంతో పాకిస్థాన్ పార్లమెంట్ లో దీనిపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఇప్పడు ఉన్న పరిస్థితుల్లో పాక్ ప్రభుత్వం గోధుమ పిండిని కూడా ప్రజలకు సరఫరా చేయలేని పరిస్థితుల్లో ఉంది. పాక్ లో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొంది. పెట్రోల్, డిజీల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రజలకు కనీసం ఆహార ధాన్యాలు దొరకని పరిస్థితి నెలకొంది. అమెరికా జోక్యం చేసుకుని ఈ విషయంలో సాయం చేయాలని కోరుతుంది. ప్రపంచ బ్యాంకు తో జరిగిన ఒప్పందం నుంచి భారత్ వైదొలగాలని చూస్తోందని ఆరోపిస్తుంది.


సెనెట్ లో పాక్ వాదనలు వినిపిస్తూ ఒప్పందం ప్రకారం  నడుచుకోవాలని లేకపోతే పాక్ లో నీటికి కటకట ఉంటుందని ఆరోపించింది. చైనా కూడా భారత్ కు వాటర్ రాకుండా బ్రహ్మపుత్ర నదిపై వంతెనలు కడుతుంది. దాన్ని ప్రశ్నించడానికి ఎవరూ లేరు. భారత్ నుంచి పాక్ కు వెళుతున్న నదీ జలాలను నెహ్రు హాయాంలో చేసుకున్న ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం నుంచి తప్పుకోవాలని భారత్ భావిస్తోంది.


తదనంతరం ఆ నదీ జలాలను భారత్ విరివిగా వాడుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టనుంది. అయితే దీన్ని అమెరికా సాయంతో అడ్డుకోవాలని పాక్ ప్రయత్నిస్తోంది. కానీ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ విషయంలో తగ్గేది లేదని చెబుతోంది. మరి పాక్, భారత్ సింధు నదీ జలాల ఒప్పందం ఎటు వైపు దారి తీస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: