మంచి గిట్టుబాటు ధర రావడంతో గుంటూరు మిర్చి యార్డు కళకళలాడుతుంది. గుంటూరులో భారీ ఎత్తున మిర్చిని డంప్ చేస్తున్నారు. రెండు రోజుల్లో దాదాపుగా లక్షా 20వేలకు పైగా బస్తాలు వచ్చాయి. ఎండలు తీవ్రత ఉన్నా కూడా జనాలు వస్తూనే ఉన్నారు. బస్తాలు వాహనాల్లోకి లోడ్ అవ్వడానికి కొంత జాప్యం జరుగుతుంది. మిర్చి యార్డులో ఎండల తీవ్రత గట్టిగా ఉండడంతో హమాలీలు కొంత ఇబ్బంది పడుతున్నా సరే వేగంగానే జరుగుతున్నాయి.
 

బస్తాలు సాయంత్రం 5గంటలకు వేడి తగ్గాక తరలిస్తూ ఉన్నారు. లోడ్ అయిన వాహనాలు వెలుపలకు వెళుతూ ఉంటే,  వివిధ ప్రాంతాల నుంచి విక్రయానికి వచ్చే వాహనాలు లోపలికి  వస్తూనే ఉన్నాయి. దాదాపుగా 341బాడిగ రకాల హవా, అంటే మిర్చి యార్డ్ లో ఉన్నటువంటి 341బాడిగ రకాల హవా కొనసాగుతుంది. కొన్ని రకాల మిర్చి ధరలు స్వల్పంగా తగ్గాయి.


4884రకం మిర్చి ధర ఒకటి తప్ప, మిగిలిన అన్ని రకాల మిర్చి ధరలు కూడా 20వేలకు పైగానే ఉన్నాయి. కామన్ వెరైటీల్లో 341, స్పెషల్ వెరైటీల్లో బాడిగ రకాల మిర్చి హవా కొనసాగుతుంది. 341 రకం మిర్చి కి 9వేల నుండి 24 వేలు, బాడిగ రకాల మిర్చికి 10 వేల నుండి 26 వేలు, కామన్ వెరైటీ 334 కి 9 వేల నుండి 24 వేల రూపాయలు, నెంబర్ 5రకానికి 10 వేల 500 నుండి 21 వెయ్యి వస్తున్నాయి.


273 రకానికి 12 వేల నుండి 22 వేల 500, 4884 రకానికి 17 వేల 500 నుండి 18 వేల 500, సూపర్ 10 మిర్చి రకానికి 11 వేల నుంచి 20 వేలు, స్పెషల్ వెరైటీ తేజ రకానికి 9 వేల నుండి 23 వేల 500, దేవునూర్ డీలక్స్ కు 9500 నుండి 22,000, తారు మిర్చికి 5 వేల 500 నుండి 13 వేలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: