చుట్టూ ఉన్న దేశాలు భారత్ పై ఎలాంటి చర్యలు చేపట్టినా, చూస్తూ ఊరుకునే పరిస్థితిలో తాము లేమని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. పాకిస్థాన్ పాక్ అక్రమిత కాశ్మీర్ లో దాడులు చేసినా, చైనా తవాంగ్, అరుణ చల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో ఎలాంటి విధ్వంసం చేపట్టినా, తాము కూడా ఎదురు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు.


భారత్ ఇప్పుడు గట్టిగా సమాధానం చెప్పేందుకు రెడీగా ఉందన్నారు. ఆఫ్రికా దేశం ఉగాండాలో జరిగిన ఒక సమావేశంలో విదేశాంగ మంత్రి జై శంకర్ మాట్లాడుతూ.. 2016 లో ఉరి ఎటాక్ జరిగిన తర్వాత, పఠాన్ కోఠ్ లో జరిగిన మరో దాడి అనంతరం, పాకిస్థాన్ లోని సైనిక స్థావరాలను, ఉగ్రవాద ముఠా స్థావరాలను ఛిన్నాభిన్నం చేశామని చెప్పుకొచ్చారు.


ఇప్పుడు ఇతర దేశాలు తమ దేశంపై దాడులు చేస్తే చూస్తూ కూర్చొనే ప్రభుత్వం అధికారంలో లేదని దాడికి ప్రతి దాడి చేసి తీరుతామని హెచ్చరికలు చేశారు. గతంలో చేసిన దాడుల గురించి కూడా చెప్పారు. కాశ్మీర్ లో సైనిక వాహనంపై జరిగిన దాడి తర్వాత భారత్ స్పందించిన తీరును తెలుసుకోవాలని సూచించారు. దేశంపై ఎక్కడ ఎవరూ ఎటాక్ చేయాలని ప్రయత్నించినా వారికి అదే రీతిలో రెట్టింపు విధానంలో తగిన బుద్ధి చెబుతామన్నారు.


గతంలో ముంబయిలో జరిగిన దాడిలో దాదాపు 180 మంది అమాయకులు చనిపోయినా పాక్ పై గత ప్రభుత్వం ఎలాంటి దాడులకు దిగలేదు. కేవలం చర్చల ద్వారా నే పాక్ లో కుట్ర పన్నిన వారిని పట్టించాలని పాక్ ప్రభుత్వాన్ని వేడుకుంది. అయితే ఇలాంటి చర్యల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ప్రజలు అప్పటి ప్రభుత్వ తీరును విమర్శించారు. ప్రస్తుతం అలాంటి సమస్య లేదు. ఎవరికైనా  దేశం పై దాడి చేయాలని ఆలోచన వచ్చినా విరమించుకునేలా పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: