
ప్రస్తుత సమాజంలో గవర్నమెంట్ కంటే ప్రైవేటు రంగంలోనే ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది. కానీ విశాఖ ఉక్కు కర్మాగారం అనేది ప్రభుత్వం అధీనంలో ఉండాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ ప్రైవేటు రంగంలో కూడా డెవలప్ మెంట్ అవుతుందన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు హైదరాబాద్ హైటెక్ సిటీలో పూర్తిగా ప్రైవేటు సంస్థలు తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది. బెంగుళూరులో సాప్ట్ వేర్ కంపెనీలకు సంబంధించి కొన్నివందల కంపెనీలు రన్ అవుతున్నాయి. చెన్నై లో పరిశ్రమలు ఎక్కువగా నడుస్తున్నాయి.
కానీ విశాఖలో స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాతనే అభివృద్ది జరిగిందన్నది వాస్తవం. దాన్ని కాపాడుకోవాలనే ఫీలింగ్ ను జేడీ తట్టి లేపుతున్నారు. ఈ ఆలోచన ఆచరణలో విజయవంతం అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రస్తుతం సమాజంలో ప్రతి తల్లిదండ్రులు వారి బిడ్డలు లక్షలు వచ్చే సాప్ట్ వేర్ ఉద్యోగాలు చేయాలని కోరుకుంటున్నారు.
ఇలాంటి సమయంలో ప్రభుత్వ రంగ సంస్థ అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా మద్దతిస్తారా.. అనేది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న. మద్దతిచ్చినా ఇవ్వకపోయినా జేడీ లక్ష్యం గొప్పదనే చెప్పొచ్చు.