
ఈ పేపర్ లీకుల వెనుక బోర్డ్ చైర్మన్, సభ్యులు, ఉద్యోగుల నుంచి రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రుల వరకు హస్తం ఉందని వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎస్‌పీఎస్‌సీ పూర్తి విశ్వసనీయతను కోల్పోయిందన్న వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల .. పేపర్ లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వ హయాంలో నియమించిన సిట్ పనితీరు నమ్మశక్యంగా లేదన్నారు.
పాత్రధారులను మాత్రమే దోషులుగా తేలుస్తూ సూత్రధారులను తప్పించే విధంగా దర్యాప్తు సిట్ సాగుతోందని వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 317 ప్రకారం టీఎస్‌పీఎస్‌సీ రద్దు విషయమై రాష్ట్రపతికి సిఫారసు చేయాలని వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం ప్రకారం ఈ నిర్ణయం తీసుకొనే బాధ్యత గవర్నర్ పై ఉందని సవినయంగా గుర్తు చేస్తున్నామని షర్మిల అన్నారు.
30 లక్షల మంది జీవితాలు.. మీ నిర్ణయం మీద ఆధారపడి ఉన్నాయన్న వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల .. తక్షణం మీరు బోర్డు రద్దు కోసం సిఫారసు చేసి, కొత్త బోర్డు ఏర్పాటు చేసే దిశగా తోడ్పాటు అందించాలన్నారు. రాష్ట్ర గవర్నర్ గా మీ విచక్షణాధికారాలు ఉపయోగించి బోర్డు రద్దు చేసేలా చూడాలని వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు.