కులాల వారి లెక్కలు కర్ణాటకలో భారీగానే ఉంటాయి. గత సారి జరిగిన ఎన్నికల్లో  లింగాయత్ ఓట్ల ఆధారంగా 67 స్థానాల్లో 40 బీజేపీ, కాంగ్రెస్ 20, జెడీఎస్ 6, ఒక్కటి ఇతరులు గెలుచుకున్నారు. ఒక్కళిక సామాజిక వర్గం ఉన్న స్థానాల్లో జేడీఎస్ 21 స్థానాాలు, బీజేపీ 14, కాంగ్రెస్ 9, గెలుచుకోగా ఇతరులు ఏమీ గెలవలేకపోయారు. ఓబీసీ సామాజిక వర్గం నుంచి బీజేపీ 18 సీట్లు, కాంగ్రెస్ 5, ఒక్కటి జేడీఎస్ గెలుచుకుంది.


ముస్లింల ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ 11, బీజేపీ 6, జెడీస్ 1 గెలుచుకుంది.  మొత్తం ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలు 18 ఉంటే కాంగ్రెస్ 11 గెలుచుకోవడం అసంతృప్తికి గురి చేసిందని కాంగ్రెస్ లీడర్లు అన్నట్లు సమాచారం. ఈ సీట్ల ఆధారంగా చూసుకుంటే లింగాయత్ ల ఓట్ల శాతం 17, ఒక్కళిగలు 15, ఓబీసీ 34 శాతం, ఎస్సీ ఎస్టీ 18, ముస్లింలు 10, బ్రాహ్మణులు మూడు శాతం కర్ణాటకలో ఉన్నట్లు తెలుస్తోంది.


లింగాయత్ లు, ఓబీసీలు గనక బీజేపీకి మద్దతు తెలిపితే రాష్ట్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. ఒక్కళిగ సామాజిక వర్గం నుంచి బీజేపీకి కొన్ని సీట్లు వచ్చినా ఇక కర్ణాటకలో బీజేపీకి తిరుగుండదు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఎలాగైనా కర్ణాటకలో అధికారం లోకి రావాలని పట్టుదలతో ఉన్నారు. హమీల వర్షం కురిపిస్తున్నారు.


ప్రతి మహిళకు రూ. 2 వేలు ఇస్తానని ప్రకటించారు. మరి ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ వైపు ప్రజలు ఏమైనా మొగ్గు చూపే అవకాశం ఉందేమో నని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య కర్ణాటకలో టప్ పోటీ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. కానీ ప్రజల మద్దతుతో మళ్లీ కమలం వికసిస్తుందా. హస్తం కన్నడ నాట జెండా ఎగురవేస్తుందా మరి కొన్ని రోజుల్లో తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: