
భారతీయ పారిశ్రామికవేత్తలు మాస్కో ప్రాంతంలో కొత్త బిజినెస్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించే పనిలో ఉన్నట్లు స్థానిక ప్రభుత్వ డిప్యూటీ చైర్మన్ లెక్కల ప్రకారం 10కంటే ఎక్కువ భారతీయ కంపెనీలు పారిశ్రామిక మాస్కో ప్రాంతంలో విజయవంతంగా పనిచేస్తున్నాయి. కొత్త ప్రాజెక్టులు కూడా పనిలో ఉన్నాయి, ఇది మాస్కో ప్రాంతానికి దాదాపు 98 మిలియన్ డాలర్ల పెట్టుబడులు తీసుకువస్తుంది.
రష్యా నుండి వాళ్ళని వాళ్ళు బహిష్కరించుకొని, అమెరికా యూరప్ దేశాల సంస్థలు వెళ్లిపోయాయి. అక్కడ అలాగని పొటెన్షియల్ లేదా అంటే కొనుగోలు శక్తి భారీగానే ఉందని తెలుస్తుంది. వ్యాపారాలు బోలెడు జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది భారత పరిశ్రమ యొక్క పారిశ్రామిక వేత్తలు దాన్ని అందుకుకుంటున్నారు. భారతదేశం వాళ్ళు వెళ్లి అక్కడ వ్యాపార సంస్థలు పెడుతున్నారు. భారత్ కి పెట్టుబడులు రష్యా నుండి రావడం లేదు కానీ భారత నుండి పెట్టుబడులు రష్యాకు వెళ్తున్నాయి. ఇవే ఇప్పుడు అంతర్జాతీయ లెక్కలుగా ఉంటున్నాయి.
రష్యా కూడా అవును మా దగ్గరికి వస్తున్నారు పెద్ద ఎత్తున వ్యాపారాలు పెడుతున్నారని అంటుంది. మార్కెట్ ఎక్కడున్నా అందుకనే తత్వం భారతీయులది. రష్యా భారతదేశానికి సబ్సిడీ ధరలకు డీజిల్ గ్యాస్ పెట్రోల్ బగ్గు అందిస్తుంది. అదే సందర్భంలో భారతదేశం నుండే రష్యా కి వ్యాపార పెట్టుబడులు వెళుతున్నాయి. దాంతో అలా బ్యాలెన్స్ అయిపోతుంది. రష్యా ఇంకా భారతదేశానికి మధ్యన ఇదంతా మోడీ ఇంకా పుతిన్ ల మధ్య జరిగిన ఒప్పందాన్ని బట్టి అని తెలుస్తుంది.