కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 75 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇస్తోంది. ఈ హమీతో పాటు ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెబుతోంది. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఇవ్వకూడదు. కానీ కేంద్రంలో, రాష్ట్రంలో మేమే అధికారంలోకి వస్తాం. కొత్త చట్టాన్ని తెచ్చైనా సరే రిజర్వేషన్లను ఇస్తామని హమీలు ఇచ్చేస్తుంది.


ప్రస్తుతం కాంగ్రెస్ విభజించు పాలించు విధానంలో కర్ణాటకలో ఎన్నికల హామీలను గుప్పిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పుట్టకముందు దేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తున్న సమయంలో హిందూ ముస్లింల మధ్య ఎక్కువగా అంతర్గత పోరాటాలు లేవు. 1857 సిఫాయిల తిరుగుబాటు తర్వాత రెండు వర్గాలుగా విభజిస్తూ మధ్యలో చిచ్చు పెట్టడానికి బ్రిటిషర్లు చాలా ప్రయత్నాలు చేశారు. నిజానికి ఆ విషయంలో సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు.


దేశంలో కాంగ్రెస్ దాని విధాన పరమైన నిర్ణయాలను ఇంకా మార్చుకోవడం లేదు. ఎందుకంటే మైనార్టీల విషయంలో మద్దతు ఇస్తూ కొన్ని వర్గాలను దూరం పెడుతోంది. కర్ణాటకలో బీజేపీ ముస్లింల రిజర్వేషన్లు తీసేసి ఒక్కళిగకు రెండు శాతం, లింగాయత్ లకు 2 శాతం ఇచ్చారు. ప్రస్తుతం వారి గురించి చర్చించకుండా ముస్లింలకు ఏకంగా 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం కాంగ్రెస్ కే చెల్లింది.


హిందువులను కుల ప్రాతిపదికన విడదీసి ఓట్లు పొందాలనే రాజకీయం సరైనది కాదు. మారుతున్న జీవన శైలికి అనుగుణంగా పరిస్థితులను అర్థం చేసుకుని మారితే తప్ప కాంగ్రెస్ పార్టీ గెలవడం సాధ్యం కాదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే దేశంలో కాంగ్రెస్ పార్టీని సొంత భుజాలపై మోసే వారు కరువయ్యారు. రాహుల్ గాంధీ  చరిస్మా పని చేయడం లేదు. సోనియా గాంధీ వయసు రీత్యా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇలాంటి సమయంలో ప్రజలకు చేరువయ్యే వాగ్దానాలు ఇవ్వాల్సిన సమయంలో రిజర్వేషన్లను పెంచడం వల్ల ఓట్లు రాలతాయనుకుంటే అంతకు మించిన పొరపాటు మరోటి ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: