
ఎన్డీఏ హాయంలో కీలక భాగస్వామిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ కు ఎందుకు భారత రత్న ఇప్పించ లేదు. మొన్నటి మొన్న బీజేపీ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకుని కలిసి అధికారంలో కొనసాగిన సమయంలో భారత రత్న ఇవ్వాలని ఎందుకు అడగలేదు. బీజేపీతో పొత్తు తెంపుకొని బయటకు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని అడుగుతున్నారని ప్రశ్నిస్తున్నారు. 1999 హయాంలో కూడా చంద్రబాబు ఎన్టీఆర్ కు అత్యున్నత గౌరవం ఇవ్వాలని ఎందుకు అడగలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
దీని వెనక అసలు కారణం ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత భారత రత్న ఇవ్వాలంటే బతికున్న భార్యకు ఇవ్వాల్సి వస్తుంది. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి ఇంకా బతికే ఉన్నారు. అధికారంలో ఉన్నపుడు గట్టిగా డిమాండ్ చేస్తే భారత రత్న వస్తే లక్ష్మీ పార్వతి తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఆయనకు నచ్చదు. అందుకే రాజకీయంగా చంద్రబాబు వేస్తున్న ఎత్తుగడ అని పొలిటికల్ నాయకులు విమర్శలు చేస్తున్నారు.
గతంలో పార్లమెంట్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ సమయంలో ఎన్టీఆర్ కుతూరు దగ్గుబాటి పురందరేశ్వరి చాకచక్యంగా సోనియా గాంధీతో మాట్లాడి లక్ష్మీపార్వతి లేకుండానే ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. కానీ భారతరత్న విషయంలో అలా కుదరదు. భార్య బతికి ఉంది. కాబట్టి ఆమెకే ఇస్తారు. ఇన్ని తెలిసి కూడా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు వేస్తున్న డ్రామాలని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.