
అంతే కాదు.. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్.. కేరళ స్టోరీ సినిమా చూడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. హైదరాబాద్ రాంకోటిలోని తారకరామ థియేటర్ లో కేరళ స్టోరీ సినిమాను.. బండి సంజయ్, లక్ష్మణ్, చింతల, కూన, నందీశ్వర్ తదితరులతో కలసి చూశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాకనే అన్ని వర్గాల మహిళలకు రక్షణ కల్పిస్తున్నారని బండి సంజయ్ తెలిపారు.
కేరళలో మూర్ఖత్వ ప్రభుత్వం ఉందని.. కమ్యూనిస్టు లు వారికి ఈ దేశం మీద నమ్మకం లేదని బండి సంజయ్ అన్నారు. బజరంగ్ దళ్ లాంటి సంస్థలు హిందూ అమ్మాయిలను కాపాడుతున్నాయని.. దేశంలో టెర్రరిజం ను ప్రోత్సహించే కుట్ర జరుగుతోందని.. కేరళ స్టోరీ సినిమా డైరెక్టర్, నిర్మాతకు బెదిరింపులు కాల్స్ వస్తున్నాయని బండి సంజయ్ పేర్కొన్నారు.
ఈనెల 14న కరీంనగర్ లో నిర్వహించే హిందూ ఏక్తా యాత్రకు కేరళ స్టోరీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ వస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. వారిని ఘనంగా సన్మానిస్తామని బండి సంజయ్ తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరు తమ పిల్లలతో కలిసి కేరళ స్టోరీ సినిమా చూడాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సినిమా రాజకీయ పార్టీలకు కనువిప్పు కావాలని.. యదార్థ గాథను చూపించారని బండి సంజయ్ అన్నారు. ఇది వినోదం కోసం తీసిన సినిమా కాదని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వాలని బండి సంజయ్ కోరారు.