
రాహుల్ గాంధీ, మరోక బీఎస్సీ ఎంపీ ఆటోమెటిక్ గా ఎంపీ పదవికి అనర్హుడయ్యారు. రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష కూడా విధించింది. ఇప్పుడు సుప్రీం కోర్టు లో ఒక పిటిషన్ వేశారు. ఆటోమెటిక్ అనర్హత వేటు తీసేయాలని కేసు వేశారు. కోర్టులో అప్పీల్ చేసుకుని ఫైనల్ అయిపోయిన తర్వాతనే శిక్ష వేయాలని కోరారు.
కానీ ఇండియాలో కింద కోర్టుల్లోనే అప్పీల్ చేసుకుని వాదనలు ముగిసి చివరి తీర్పు వచ్చే సరికి నాలుగు, అయిదేళ్ల సమయం పడుతుంది. ఇలాంటి సందర్భంలో మేజిస్ట్రేట్ విధించిన శిక్ష పడాలంటే కూడా చివరి వరకు ఆగాలి. అప్పటికీ ఆ ఎంపీ, ఎమ్మెల్యే పదవి కాలం అయిపోతుంది. ఆటో మెటిక్ అనర్హత వేటు పడినా వ్యక్తి వచ్చి అప్పీల్ చేస్తే మేం పరిశీలిస్తాం అని సుప్రీం కోర్టు వ్యాఖ్యనించింది. కానీ ఏ సంబంధం లేని వ్యక్తి వచ్చి ఆటోమెటిక్ అనర్హత చట్టాన్ని తీసేయాలని కోరితే స్పందించాల్సి అవసరం లేదని చెప్పింది.
ఇదే సుప్రీం కోర్టు ఏడాది లోగా నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు అంశాన్ని తేల్చాలని ఆదేశాలిచ్చింది. అసలు నేరస్థులు రాజకీయాల్లో ఉండకూడదని చెప్పింది. కానీ రాహుల్ గాంధీ శిక్ష పడిన నాయకుడు.. ఆయన వచ్చి అప్పీల్ చేసుకుంటానంటే మాత్రం విచారించడానికి ఒకే అంది. అసలు రాజకీయ నాయకులు నేరారోపణలు ఎదుర్కొని శిక్ష పడిన తర్వాత వారు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయకుండా నిలువరించాలని ప్రజలు కోరుతున్నారు.