
కానీ అనుకోకుండా తాను ఏ వాతావరణం తనకు అనుకూలంగా ఉంటుందని అనుకుందో, అదే వాతావరణం తనకి ఇప్పుడు ప్రతికూలం అయినట్టుగా తెలుస్తుంది. రష్యాపై ఉక్రేనియన్ ఎదురుదాడికి ప్రకృతి బ్రేక్ వేసిందని అంతర్జాతీయ మీడియా చెప్పుకొస్తుంది. ఉక్రేనియన్ యుద్ధభూమిలో బురదతో కూడిన భూభాగం కారణంగా ఉక్రేనియన్ దళాలు తమ జర్మన్ తయారీ అయిన హోవిట్జర్లను ఉపయోగించ లేకపోతున్నాయి.
150 ఎంఎం స్వీయ చోదక ఆయుధాలు బురద కారణంగా ముందుకు కదలలేదు. ఉక్రెయిన్ పై ఎదురుదాడి ప్రారంభమైనప్పుడు ఆందోళన చెందుతున్నవారికి ఉక్రెయిన్ ప్రాథమిక మద్దతు గురించి న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అది వాళ్ళు కోరుకున్నంత సులభంగా అయితే జరగలేదని అంటున్నాయి అక్కడ మీడియా వర్గాలు. వింటర్ ని అడ్డుపెట్టుకొని రష్యాను ముప్పు తిప్పలు పెడదాం అనుకున్నా ఉక్రెయిన్ ప్లాన్ అదే వింటర్ వల్ల నాశనం అయిపోయిందని తెలుస్తుంది.
కారణం ఏంటంటే జర్మనీ దగ్గర నుండి ఇంకా వేరే వేరే దేశాల దగ్గర నుండి తీసుకొచ్చిన అత్యాధునికమైన కోవిజర్లు యుద్ధ ట్యాంకులు అదే చలికాలపు బురద వల్ల ఇరుక్కుపోయిన పరిస్థితి ఏర్పడింది. కానీ రష్యా మాత్రం ఆ యుద్ధ ట్యాంకులను వెతికి మరి ధ్వంసం చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది.