
మొత్తం ఉక్రెయిన్ ను గెలుచుకునేందుకు రష్యా సిద్ధమైంది. అయితే యుద్ధాన్ని చాలా రోజుల పాటు కొనసాగించి రష్యా వద్ద ఆయుధాలు అయిపోగానే రివర్స్ ఎటాకింగ్ కు దిగి రష్యాను దెబ్బతీయాలనే ప్లాన్ అమెరికా చేస్తున్నట్లు రష్యా అనుమానిస్తోంది. కానీ అది సాధ్యమయ్యే పని కాదని అమెరికా, యూరప్ దేశాలు గుర్తు పెట్టుకోవాలని రష్యా హెచ్చరిస్తుంది.
ఈ విషయంలో అమెరికా, ఉక్రెయిన్ యూరప్ దేశాలు రష్యాను తక్కువ అంచనా వేయొద్దని నిపుణులు చెబుతున్నారు. ఇరాక్ అధ్యక్షుడిలా పుతిన్ ను పట్టుకోవాలని ఉరి తీయాలని అమెరికా భావిస్తే అంతకన్న తెలివి తక్కువ తనం ఏమీ ఉండదని మేధావులు అభిప్రాయ పడుతున్నారు. ఒక వేళ యుద్ద సామగ్రి అయిపోతే అణ్వస్త్ర దాడికి దిగేందుకు రష్యా ఏ మాత్రం వెనడాదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇన్ని రోజులు యుద్దం సాగడానికి అమెరికా, యూరప్ దేశాలు కారణం. పరోక్షంగా అమెరికా సాయం చేయబట్టే ఇలాంటి పరిస్థితి రష్యాకు ఎదురవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏయే దేశాలు ఉక్రెయిన్ కు సాయం చేస్తున్నాయో వారందరూ గుర్తు పెట్టుకోవాలని సూచించింది. వారికి సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతామని పుతిన్ హెచ్చరిస్తున్నారు. పుతిన్ ఇరాక్ లోని సద్ధాం హుసేన్ టైప్ కాదు. అణ్వస్త్రాలు ఉన్న దేశానికి నాయకుడు.. తనపైకి ఏ మాత్రం ఎదురు దాడి జరిగినా దీటైన జవాబివ్వగల సమర్థుడు. మరిన్ని రోజులు గడిచే కొద్ది ఉక్రెయిన్ రష్యా యుద్దం ఎటు వైపు పోతుంది ఏయే మలుపులు తిరుగుతుందో చూడాలి.