పాకిస్తాన్ లో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు  ఏర్పడ్డాయని తెలుస్తుంది. అక్కడ ప్రస్తుతం అల్లకల్లోలం జరుగుతుంది. గంట గంటకి పాకిస్తాన్ లో ఉద్రిక్త పరిస్థితులు పెరిగిపోతున్నాయి. ఎక్కడకక్కడ దాడులు కూడా జరుగుతూనే ఉన్నాయి. జాట్స్ అంటేనే శక్తివంతమైన వాళ్ళని అక్కడ అనుకుంటారు. అలాంటి జాట్ రెజిమెంట్ పైన కూడా అక్కడ దాడులు జరిగాయని తెలుస్తుంది. అక్కడ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అవడంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలుస్తుంది.


అది కూడా ఆయనని కాలర్ పట్టుకుని అరెస్టు చేయడం అక్కడ మరింత ఉద్రిక్త వాతావరణాన్ని పెంచిందని తెలుస్తోంది. అసలు అక్కడ జరుగుతున్న కాల్పుల్లో ఎవరు ఎవర్ని కాలుస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. కరాచీలో అయితే కరెంటు బంద్ చేశారు. ఇంటర్నెట్ బంద్ చేశారు. స్కూల్ కి సెలవులు ఇచ్చేసారు. ఫేస్బుక్ వంటి సామాజిక మధ్యామాలను సస్పెండ్ చేశారు. అదే సందర్భంలో పాకిస్తాన్ లోని అనేక చోట్ల పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరుపుతున్నారు.


వీటిలో  ఇమ్రాన్ ఖాన్ మద్దతు దారులు అనేకమంది మృత్యువాత పడుతున్నట్లుగా తెలుస్తుంది. వియన్ వ్యాలీ ఎయిర్ బేస్ దగ్గర ఒక విమానాన్ని తగలబెట్టారు ఇమ్రాన్ ఖాన్ మద్దతు దారులు. పాకిస్తాన్ దేశమంతా కూడా అల్లర్లు విధ్వంసాలు జరుగుతున్నాయి ఇప్పుడు. దాంతో సరిహద్దు దేశంలోని విధ్వంసకర పరిస్థితుల దృష్ట్యా ఇండియన్ ఆర్మీ  అలర్ట్ అయినట్లుగా తెలుస్తుంది. పాకిస్తాన్ రేడియో కేంద్ర కార్యాలయాన్ని కూడా కాల్చివేశేసారట.


ఇప్పుడు అక్కడ అల్లర్లు ప్రతి ప్రాంతానికి విస్తరించుకుంటూ వెళ్లిపోతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతు దారులు  విమానాలను తగలబెట్టడం, రేడియో కార్యాలయాన్ని తగలబెట్టడం ఇవన్నీ జరుగుతున్న దృష్ట్యా అక్కడి సైన్యం, పరిస్థితులను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. పాకిస్తాన్ లో సాధారణ పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయో తెలియని పరిస్థితి అయితే ఏర్పడింది అన్నట్టుగా తెలుస్తుంది. అనుకోకుండా అంటుకున్న నిప్పునైతే చల్లార్చగలం కానీ, కావాలని చెలరేగే  మంటని చల్లార్చలేమని కొంతమంది అంటున్నారు. మరి ఈ రాజకీయ రగడలో పాకిస్తాన్ ఏమైపోతుందో తెలియడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: