పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ప్రస్తుత ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌  మధ్య తలెత్తిన వివాదం పతాక స్థాయికి చేరుకుంది. దాని వల్ల ఇప్పుడు పాకిస్తాన్ రెండు ముక్కలు కాబోతుందా అనే సందేహం ఏర్పడుతుంది కొంతమందికి. తాజాగా పాకిస్తాన్ సైన్యం, ఇంకా ఐ ఎస్ ఐ రంగంలోకి దిగి ఇమ్రాన్ ఖాన్ ని చొక్కా పట్టుకొని అరెస్టు చేసి తీసుకువెళ్లాయి. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని తెలుస్తుంది.


ఇమ్రాన్ ఖాన్ గత కొంతకాలంగా పాకిస్తాన్ సైన్యంపై, ఐ.ఎస్.ఐ పై, అలాగే న్యాయవ్యస్తపై కూడా విరుచుకుపడుతున్నారు. వీళ్ళందర్నీ దోషులుగా చూపిస్తున్నాడు ఆయన. అలాగే వీళ్లంతా అమెరికా చెప్పు చేతుల్లో నడుచుకుంటున్నారని అంటున్నాడు ఆయన. అయితే జ్యూడిషరీలో కొంతమంది ఇమ్రాన్ ఖాన్ కు ఫేవరబుల్ గా మారారని తెలుస్తుంది. దాంతో ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌  ప్రభుత్వం వారిపై యాక్షన్ తీసుకుంటామని అంటుంది.


సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇమ్రాన్ ఖాన్ కు అనుకూలంగా ఉన్నాడని ఆయనను రాజీనామా చేయమనే పరిస్థితి వచ్చింది ప్రస్తుతం. ప్రభుత్వం వీళ్ళ చేతుల్లోనే ఉంది. సైన్యం కూడా వీళ్ళనే అంగీకరిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం అమెరికా ఎలా చెప్తే అలా చేస్తుందని తెలుస్తుంది. ఇమ్రాన్ ఖాన్ వెనుక ఉన్న వాళ్ళలో చాలామంది చైనా చెప్పినట్లుగా నడుచుకునే వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది. ఇప్పుడు ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వానికి సపోర్ట్ ఇవ్వడానికి అవసరమైతే అమెరికా తన సైన్యంతో ముందుకు వస్తుంది.


అలాగే ఇమ్రాన్ ఖాన్ వెనుక ఉన్న వాళ్ళని నడిపించడానికి, ఇమ్రాన్ ఖాన్ కు సపోర్ట్ గా చైనా సైన్యం  ముందుకు వస్తుంది. ఒకప్పుడు పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోయింది. ఇప్పుడు అలాగే ఫైబర్ ఫక్తూనాతో పాటుగా సరిహద్దు ప్రాంతానికి సంబంధించిన రాష్ట్రాలు కూడా విడిపోతాయని అంటున్నారు. అక్కడ టీటీపికి సంబంధించిన ప్రాంతాలన్నిటినీ కలిపి ఒక కూటమిగా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. అంతేకాకుండా ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో పెట్టి ఇక బయటికి రానివ్వకుండా చేస్తారేమో అని కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: