అమెరికా ఇంకా బ్రిటన్లను జీ7 సదస్సుకు ముందే ఉక్రెయిన్ అధ్యక్షుడు రిక్వెస్ట్ చేశాడట. ఎఫ్ 16 యుద్ధ విమానాలను ఇవ్వమని అమెరికాని అడిగాడట. అయితే అమెరికా పద్ధతి ఏంటంటే ముందు ఇవ్వను అంటూనే తర్వాత తన కింద వాళ్లతో ఇప్పిస్తుందన్నట్లుగా తెలుస్తుంది. లాక్ హీట్ మార్టిన్ వాళ్లు ఎఫ్ 16 విమానాలను తయారు చేస్తారని తెలుస్తుంది. అది ఇవ్వాలంటే అమెరికా పర్మిషన్ ఉండాలట.


ఇదివరకు జర్మన్ తన దగ్గర ఏవైతే ఛాలెంజర్ రాకెట్ లాంచర్లు ఉన్నాయో వాటిని ఇవ్వాలన్నప్పుడు కూడా ఇదే జరిగిందట. బ్రిటన్ దగ్గర ఉన్న లేపార్డ్లు గాని, జర్మనీ దగ్గర ఉన్న ఛాలెంజర్లు గాని ఇవి రెండు ఇవ్వాల్సినటువంటి సందర్భంలో ఆ దేశపు పర్మిషన్ కావాలంటే అమెరికా ఒత్తిడితో ఇచ్చారట. మొదట ఇవ్వనన్న జర్మనీ అత్యాధునికమైన యుద్ధ ట్యాంకులను ఇచ్చింది. మిస్సైల్స్ ను ఇచ్చింది. ఇవన్నీ చేస్తున్న అమెరికా మాత్రం ఇవ్వకుండా ఉంటుందా ముందు ఇవ్వనూ ఇవ్వనూ అంటూ చెప్తుంది.


ఆ తర్వాత మిగిలిన దేశాలతో అడిగించుకుని, అడిగించుకుని ఎప్పటికో గత్యంతరం లేక ఇస్తున్నాం అన్నట్లు మాట్లాడి అప్పుడు ఇస్తుందట అమెరికా. మిగిలిన దేశాలతో అడిగించుకుంటుంది అది. అంతేకాకుండా మీరు ఇమ్మన్నారనే కదా ఇచ్చాము యుద్ధ విమానాలు అని అడుగుతుంది. ఆపైన వాళ్ళందరూ అడిగిన, కోరిన కోరిక మీదే ఇచ్చాము యుద్ధ విమానాలు అని ప్రపంచం ముందు ఒక నాటకం ఆడుతుంది అమెరికా.


ఫైనల్ గా ఏది ఏమైనా అమెరికా ఎలా ఇచ్చినా సరే చివరికి ఎఫ్16 యుద్ధ విమానాలు ఉక్రెయిన్ ని చేరబోతున్నాయి అన్నట్లుగా తెలుస్తుంది. దాంతో బలం తెచ్చుకున్న ఉక్రెయిన్ మరింతగా రెచ్చిపోయి రష్యాపై ఎనలేని దాడిని చేస్తుంది అన్నట్లుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు ఆ రేంజ్ లో కనుక ఉక్రెయిన్ దాడి చేస్తే, ఆ వెంటనే ఇప్పటికే యుద్ధంలో ఉక్రెయిన్ పై కొంతవరకు గెలుపును సాధించామని అనుకుంటున్న  రష్యా కూడా అంతకన్నా బీభత్సంగా దాడి చేస్తుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: