
అయితే జైలుకు వెళ్లే పరిస్థితి కవితకి ఎదురైనట్లు తెలుస్తుంది. ఈ కేసులో ఏ సెవెన్ గా ఉన్న విజయ్ సాయి రెడ్డి అల్లుడు సోదరుడు మేరికే శరత్ చంద్రారెడ్డి అప్రూవల్ గా మారారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు స్వచ్ఛందంగా వెల్లడించడానికి తాను సిద్ధమేనని ఆయన చెప్పారు. తాను అప్రూవల్ గా మారేందుకు అనుమతించాలని ఆయన పెట్టుకున్న అభ్యర్థనను సిబిఐ ఈడీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఆమోదించింది.
తద్వారా ఆయనికి క్షమాభిక్ష ప్రసాదించింది. అయితే ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పాత్రలు ఏమిటి, నేరం జరిగిన విధానం తదితర అంశాలపై ఆయన దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. దాని ఆధారంగా భవిష్యత్తులో కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు రాజకీయ నిపుణులు. శరత్ చంద్రారెడ్డి వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఆయన కుమారుడు మాగుంట రాఘవ్ ఇంకా భారత రాష్ట్రీయ సమితి కి చెందిన ఎమ్మెల్సీ కవిత వీళ్ళందరూ కలిసి సౌత్ గ్రూపు వెనక ఉండి నడిపించారని ఒక అభియోగం.
ఆప్ నేతలకు వంద కోట్లు ముడుపులు ఇచ్చి మందు విధానాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారని మరొక అభియోగం ఉన్నాయి. కవితకి ఇంకా మిగిలిన వాళ్ళకి సంబంధించిన విభాగాలు శరత్ చంద్రారెడ్డి నడుపుతున్నట్లుగా తెలుస్తుంది. ఈయన అప్రూవల్ గా మారడంతో ఇక తర్వాత కేసు కవిత వైపుకు మలుపు తిరుగుతున్నట్లుగా తెలుస్తుంది.