ఇక ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు శుభవార్త. ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలవ్వడం జరిగింది. ఇక ఈ ఫలితాలను శుక్రవారం అనగా జులై 23 వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేయడం జరిగింది. ఇక పరీక్ష ఫీజు కట్టిన వారందరికీ కూడా కనీస మార్కులు ఇచ్చి పాస్‌ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక అలాగే సెకండియర్‌ విద్యార్థులు ఫలితాలను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునేలా ఆప్షన్‌ ఇవ్వడం జరిగింది.ఇక ఇంటర్‌ ఫస్టియర్‌ ఫెయిలైన విద్యార్థులు కూడా పరీక్ష ఫీజు చెల్లించి ఉంటే వారికి కూడా మినిమం 35 మార్కులు వేసేవిధంగా కేటాయించడం జరిగింది. ఇక ఇంటర్‌ సెకండియర్‌లో మొత్తం 5,08,672 మంది విద్యార్థులు ఉండగా అందులో మొత్తం 2,53,138 మంది బాలురు,ఇంకా 2,55,534 మంది బాలికలు ఉన్నారు.ఇక వీరందరూ కూడా కరోనా పుణ్యమా అని పాస్ అవ్వడం జరిగింది.

ఇక విద్యార్థులకు ఈ ఫలితాలపై అసంతృప్తి అనేది కనుక ఉంటే కోవిడ్ మహమ్మారి పూర్తిగా తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి పేర్కొనడం జరిగింది. భవిష్యత్‌లో పిల్లలకు ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా వుండే మార్కులే ప్రకటించామన్నారు. ఇక ఫలితాలు కోసం ఈ వెబ్ సైట్ లను ఓపెన్ చేసి తెలుసుకోండి.

https://bie.ap.gov.in/ 
http://www.manabadi.co.in/ 
http://examresults.ap.ac.in/ 
https://results.bie.ap.gov.in/ 
https://results.apcfss.in/

ఇక కరోనా మహమ్మారి దారుణంగా విజృంభించిన ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ముందుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం చివరి క్షణం దాకా పరీక్షలను ఎలాగైనా నిర్వహించాలనే ఉద్దేశంతోనే ముందుకు సాగడం జరిగింది. కానీ ఇక సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మళ్ళీ ఈ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.ఇక ఇప్పట్లో పరీక్షలు జరిగే అవకాశం లేకపోవచ్చు...

మరింత సమాచారం తెలుసుకోండి: