నిరుద్యోగులకు శుభవార్త..మహిళా అభివృద్ధి ఇంకా అలాగే శిశు సంక్షేమ శాఖలో 181 గ్రేడ్ 1 ఎక్స్ టెన్షన్ ఆఫీసర్లు ఇంకా సూపర్ వైజర్ల పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు మహిళా అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.


ఖాళీల వివరాలకు సంబంధించి కాళేశ్వరం 26 ఖాళీలు, బాసర 27 ఖాళీలు, రాజన్న 29ఖాళీలు, భద్రాద్రి 26 ఖాళీలు, యాదాద్రి 21 ఖాళీలు, చార్మినార్ 21 ఖాళీలు, జోగులాంబ 31 ఖాళీలు ఉన్నాయి.తరువాత దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ (హోమ్ సైన్స్, సోషల్ వర్క్, సోషియాలజీ), లేదా బీఎస్సీ (ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్), బీఎస్సీ ( ఫుడ్ అండ్ న్యూట్రిషన్ , బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ), లేదా బీఎస్సీ (అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ పబ్లిక హెల్త్, బోటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ) లేదా బీఎస్సీ( క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ) లేదా బీఎస్సీ(అప్లైడ్ న్యూట్రిషన్, బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ) లేదా బీఎస్సీ( ఫుడ్ సైన్సెస్ అండ్ క్వాలిటీ కంట్రోల్ జువాలజీ, బోటనీ అండ్ కెమిస్ట్రీ, బయోలాజికల్ కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి. 


దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 18 నుండి 44 సంవత్సరాల లోపు ఉండాలి.ఇంకా అలాగే అభ్యర్ధుల ఎంపిక వచ్చేసి రాత పరీక్ష అధారంగా ఉంటుంది. రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. దరఖాస్తులను ఆన్ లైన్ లో పంపాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 8, 2022 నుండి ప్రారంభమౌతాయి. సెప్టెంబర్ 29 , 2022 దరఖాస్తులకు చివరి గడువుగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్  http://www/tspsc.gov.in/ ని ఒకసారి సందర్శించి తెలుసుకోండి.కాబట్టి ఆసక్తి ఇంకా అలాగే అర్హత గల నిరుద్యోగులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: