కరోనా కరోనా అంటూ ప్రపంచం అల్లాడిపోతోంది. రోజు రోజుకి కరోనా వైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతుండటం, పాజిటివ్ లక్షణాలు కలిగిన వ్యక్తుల సంఖ్య విపరీతంగా పెరగడంతో పాటు అదే స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ వ్యాధిపై ప్రపంచ దేశాలు అన్ని ఆందోళనలో ఉన్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ కు మందు లేకపోవడంతో ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ ను ప్రపంచ దేశాలు పాటిస్తున్నాయి.  అసలు ఈ వ్యాధి ఎందుకు ? ఎలా వచ్చిందో అన్న విషయం పక్కన పెడితే, ఎప్పుడు ఎవరు దాని ప్రభావానికి బలవుతారో తెలియక అల్లాడిపోతున్నారు. ఈ కరోనా ఈ స్థాయిలో వ్యాప్తి చెందుతుందని ఎవరు ఊహించలేకపోయారు. తాము చేయని తప్పుకి వేలాది, లక్షలాది మంది ఫలితం అనుభవిస్తున్నారు. దాదాపు 171 దేశాల్లో దీని ప్రభావం ఇప్పటికే చవిచూస్తున్నాయి.

 

IHG

 ప్రపంచ దేశాలకు పెద్దన్న గా ఉంటున్న అమెరికా కూడా వణికిపోతోంది. ఇక భారత దేశంలో దీని ప్రభావం కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఏప్రిల్ 14వ తేదీ వరకు దేశంలో ప్రజలందరూ రోడ్ల పైకి రాకుండా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో ప్రజల్లో ఒక్కసారిగా కలవరం మొదలైంది. దీనికి కారణం కరోనా ప్రభావంతో ఎక్కువగా నష్టపోయేది ఎగువ, దిగువ, మధ్యతరగతి ప్రజలే. ఒక్క నెల జీతం రాకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇక కూలీల సంగతి సరేసరి. వారికి ఏ రోజు పని లేకపోయిన పస్తులు ఉండే పరిస్థితి. కానీ ప్రభుత్వం మాత్రం ఓ ఐదు కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, ఎకౌంట్లో 500 వేసి తమ బాధ్యత అయిపోయింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నాయి. 

IHG


ఇక ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు లాక్ డౌన్  ఒక్కటే పరిష్కారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నా, ప్రభుత్వాలు పోలీసుల ద్వారా దీనిని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయం లో పోలీసులకు పూర్తి అధికారాలు ఇచ్చేయడంతో వారు రోడ్డు మీద జనాలు కనిపిస్తే చాలు లాఠీలకు పని చెబుతున్నారు. జనాల ఒంటి మీద దద్దుర్లు తెలేలా బాధేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ కరోనా వైరస్ పై ఎవరికి వారు పోస్ట్లు పెడుతున్నారు. జనాలు రోడ్ల మీదకు రాకుండా చూసే బాధ్యత పోలీసులపై ఉన్నా, వారిని ఈ స్థాయిలో దండించే అధికారం మాత్రం వారికి లేదనే చెప్పాలి. అసలు జనాలు రోడ్లపైకి ఎందుకు వస్తున్నారు అనే కారణం కూడా తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించడం లేదు. అసలు ఈ విషయంలో ప్రజలు చేసిన తప్పేంటి అనే ప్రశ్న కూడా తలెత్తుతున్నాయి. 

 


తప్పు పూర్తిగా ప్రభుత్వానిదే ఎందుకంటే జనవరి 30వ తేదీన దేశంలో మొదటిసారి కరోనా వైరస్ బయటపడింది. కానీ అంతకు ముందే వైరస్ కారణంగా ఆ దేశం అతలాకుతలం  అయిన సంగతి అందరికీ తెలుసు. ఇక మన దేశంతో పాటు విదేశాలు కూడా బాగా నష్టపోయాయి. విదేశాల నుంచి విమానాల ద్వారా భారతదేశంలోకి ప్రయాణించిన వారి ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ సమయంలోనే  కేంద్రం ఎయిర్ పోర్ట్ ల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి తనిఖీలు చేపట్టి ఉంటే ఈ పరిస్థితి భారతదేశానికి ఎదురయ్యే ఉండేది కాదు. అసలు భారతదేశంలో లాక్ డౌన్ పెట్టాల్సిన అవసరం కూడా ఏర్పడేది కాదు. 


అసలు చైనాలో కరోనా ప్రబలిన తరువాత భారత్ లో అడుగు పెట్టిన విదేశీయుల సంఖ్య 60 ,70 వేల వరకు ఉంది. అప్పట్లోనే వారిని  క్వారంటైన్ లోనే ఉంచి బయటకి పంపిస్తే ఏ సమస్య ఉండేది కాదు. అక్కడ లక్షణాలు బయట పడిన వారికి అక్కడే చికిత్స అందించి వారికి న్యాయం చేసే అవకాశం ఏర్పడేది. కానీ వారందరినీ అలా వదిలేయడం వల్ల ఇప్పుడు తీవ్రస్థాయిలో కరోనా మూడో స్టేజికి వెళ్లేలా కనిపిస్తోంది. ఇప్పుడు తప్పు ప్రజలదా కేంద్రానికి అన్న విషయం ప్రస్తావించడం సందర్భం కాకపోయినా... మళ్లీ ఈ విధమైన తప్పులు దొర్లకుండా సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు రాత్రికి రాత్రి లాక్ డౌన్ అంటూ ప్రకటించినా, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ ముందస్తుగా అవేవీ ఆలోచించకుండానే లాక్ డౌన్ ప్రకటన వెలువడింది. 

 

నిత్యావసరాల కోసం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కరోనా ను నియంత్రించడంలో ప్రభుత్వాలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఇక ప్రైవేటు ఉద్యోగుల పరిస్థితి వర్ణనాతీతం. షాపులు, ఆపీసులు బంద్ అవ్వడంతో యజమానులు బిజినెస్ జరగకుండా జీతాలు తమ దగ్గర పనిచేసే వారికి ఇచ్చే పరిస్థితి లేదు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వ్యాధి నివారణ కోసం ప్రజలు సరిగా సహకరించడం లేదు అన్నట్లుగా ప్రభుత్వాలు నిందలు వేయడం సరికాదు. ఇప్పుడు చాలామంది వేరే వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. వారి స్వస్థలాలకు వెళ్లలేక ఉన్న చోట ఉండలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారి పరిస్థితి వర్ణనాతీతం అన్నట్టుగా ఉంది. చైనాలో వైరస్ విజృంభిస్తున్న సమయంలోనే కేంద్రం మేల్కొని ఉంటే ప్రజలు ఎన్ని కష్టనష్టాలు చవి చూడాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఖచ్చితంగా  భారతదేశంలో  కరోనా విజృంభించడం పాలకుల పాపమే అందులో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: