వైఎస్సార్‌సీపీ ప్ర‌లోభాల‌కు లొంగ‌లేదు..అదిరింపుల‌కు బెద‌ర‌లేదు.. 75ఏళ్ల వ‌య‌స్సులోనూ యువ నాయ‌కుడిలా రాజ‌కీయాల్లో చురుకుగా క‌దులుతున్న టీడీపీ సీనియ‌ర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీరే వేరు. గోరంట్ల బుచయ్య చౌదరి వయసుతో నిమిత్తం లేకుండా సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఫేస్ బుక్ లైవ్ లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. కోవిడ్ సందర్భంగా బయటకు వయసు రీత్యా రాలేకపోతున్నా గోరంట్ల బుచ్చయ్య చౌదరి కార్యకర్తలకు మాత్రం అందుబాటులో ఉంటూ వస్తున్నారు. ఆయ‌న టీడీపీ  ఆవిర్భావం నుంచి అదే పార్టీలో కొన‌సాగుతున్నారు. పార్టీనే న‌మ్ముకుని ఉన్నాన‌ని, పార్టీ త‌న‌కు క‌న్న త‌ల్లితో స‌మాన‌మ‌ని చెబుతుంటారు. 

 

ప్రస్తుతం అధికార పార్టీ నుంచి ఆఫర్ వచ్చినా ఆయన కన్నతల్లి లాంటి పార్టీకి మోసం చేయలేనని చెప్పడం పార్టీ పట్ల ఆయనకున్న నిబద్దతకు నిదర్శనమని చెప్పకతప్పదు. గోరంట్ల బుచ్యయ్చ చౌదరి లాంటి నమ్మకమైన నేతలు పార్టీకి పదిమంది ఉంటే ప్రస్తుతం ఈ గతి పట్టేది కాదన్నది పార్టీ నేతల నుంచి విన్పిస్తున్న మాట. అయితే  ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్న గోరంట్ల బుచ్యయ్య చౌదరి మాత్రం పార్టీపై తన అభిమానాన్ని మాత్రం వీడకపోవ‌డం గ‌మ‌నార్హం.చంద్రబాబు హయాంలో మాత్రం గోరంట్ల బుచ్చయ్య చౌదరికి న్యాయం దక్కలేదు. 

 

గత ప్రభుత్వ హయాంలో ఆయన తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు.కాని  ఎందుక‌నో చంద్ర‌బాబు ఆయ‌న‌కు స‌రైన న్యాయం చేయ‌లేద‌నే చెప్పాలి. ఆయ‌న మాట‌ల‌కు..ఆచ‌ర‌ణ‌నే స‌మాధానంగా నిలుస్తుంది. రాజ‌కీయాల్లో మాట మీద నిల‌బ‌డే నాయ‌కులు అరుద‌నే చెప్పాలి...ఇక ఇప్పుడున్న అవ‌కాశ‌వాద రాజ‌కీయాల్లో అయితే అంజ‌న‌మేసి గాలించినా గోరంట్ల లాంటి నేత‌ను దొర‌క‌బుచ్చుకోవ‌డం చాలా క‌ష్ట‌మేన‌ని చెప్పాలి. దుర‌దృష్ట‌వ‌శాత్తు ఆయ‌న సుదీర్ఘ‌కాలంగా టీడీపీనే ప‌ట్టుకుని ప‌నిచేస్తున్నా ఎన్టీఆర్ హయాంలో తప్పించి ఆయనకు ఎప్పుడూ మంత్రి పదవి దక్కలేదు. తన నమ్మకాన్ని చంద్రబాబు విశ్వాసంలోకి తీసుకోలేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి త‌న సన్నిహితుల వద్ద బాధపడుతుంటారు.  

 

ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటికి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక కొంద‌రు వైసీపీ సీనియ‌ర్లు సైతం బుచ్చ‌య్య అసెంబ్లీలో ఎన్ని విమ‌ర్శ‌లు చేస్తున్నా మా బుచ్చ‌న్న అంటారే త‌ప్పా ఆయ‌న అగౌర‌వ ప‌రుస్తూ మాట్లాడ‌రు.. అన్నా మీలాంటి నేత‌లు మా పార్టీలో ఉండాలి.. మా పార్టీలోకి వ‌చ్చేయ‌మ‌ని కూడ వారు స‌ర‌దాగా బుచ్చ‌య్య‌తో అంటూ ఉంటుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: