రాయలసీమ.. తరతరాలుగా వెనుకబడే ఉన్న ప్రాంతం.. విచిత్రం ఏంటంటే రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన నాయకులే ఎక్కువ కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పాలించారు. ఇక ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్రలో కూడా రాయలసీమ నేతలే సీఎంగా పగ్గాలు అందుకున్నారు. అధికారం చేతిలో ఉన్నా రాయలసీమ కష్టాలు తీరింది లేదు. రాయలసీమ రాళ్ల సీమగా, కరవు సీమగానే ఉండిపోయింది. 

 

 

ఇప్పుడు సీఎం జగన్ ఆ దృశ్యం మార్చేస్తానంటున్నారు. రాయల సీమ నీటి కష్టాలు తీరుస్తానంటున్నారు. అందుకు ఆయన ఎంచుకున్న మార్గం రాయలసీమ ఎత్తిపోతల పథకం. ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు అతిపెద్దదిగా భావించే హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం కంటే పెద్ద పథకం. హంద్రీనీవా, పట్టిసీమ, ముచ్చుమర్రి, కొండవీటి వాగు, పురుషోత్తపట్నంలాంటి  అన్ని ఎత్తిపోతల పథకాలకంటే ఇదే ఎక్కువ సామర్థ్యం ఉన్నది. కర్నూలు జిల్లా సంగమేశ్వర వద్ద జగన్ సర్కారు దీన్ని నిర్మించబోతోంది.  

 

IHG

 

రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజు మూడు టీఎంసీల నీటిని వరదల సమయంలో కృష్ణా నది నుంచి రాయలసీమకు మళ్లించాలన్నది జగన్ సర్కారు ఆలోచన. శ్రీశైలంలో 800నుంచి 850 అడుగుల వరకు నీరు ఉన్నప్పుడు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా అవసరాలకు నీటిని మళ్లించేలా పంప్ చేసి పోతిరెడ్డిపాడు సమీపంలోని 4కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎస్ఆర్ఎంసీలోకి విడుదల చేస్తారు. 

 

 

IHG


కృష్ణా నదికి గరిష్టంగా వరదలు ఉన్నపుడు రోజుకు 8టీఎంసీల వరకు కూడా పంప్ చేసేలా నిర్మించి సీమ అవసరాలు తీర్చాలనేది  వైఎస్‌ జగన్ సర్కార్ ఆలోచన. ఆలోచన బాగానే ఉంది. అనుకున్నట్టుగా ఈ పథకం సకాలంలో పూర్తయితే జగన్ కొత్త చరిత్ర సృష్టించినట్టే..! 

మరింత సమాచారం తెలుసుకోండి: