మండలిలో ప్రస్తుతం నారా లోకేష్ ఉన్నందున ఆయన దూకుడుకు, యనమల రామకృష్ణుడు ఉన్నందున ఆయన వ్యూహానికి వైసీపీ నేతలు వెనక్కి తగ్గక తప్పదని.. ఏ విషయంపైనా.. నిశితంగా దృష్టి పెడుతున్నారని అంటున్నారు. ఇటీవల మూడు రాజధానులు, సీఆర్ డీఏ రద్దు వంటి అంశాల్లో చర్చల సందర్భంగా లోకేష్ వ్యవహరించిన తీరును కొందరు విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. శాసన సభలో చంద్రబాబు, మండలిలో లోకేష్ ఉన్నారు. అది చాలు అనే వాదన టీడీపీలోనూ వినిపిస్తోంది. వైసీపీ నేతలకు కళ్లెం వేయడానికి. మిగిలిన సీనియర్లు ఎలానూ ఉన్నారని అంటున్నారు.
అంతేకాదు.. ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు మెజారిటీతోనే పనిలేదని, వాయిస్ ఉంటే చాలని, ఈ విషయంలో టీడీపీకి ఇబ్బందులు లేవని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కానీ, వైసీపీ బలం పెరిగిన నేపథ్యంలో టీడీపీ నేతలకు అసలు వాయిస్ వినిపించేందుకు అవకాశం ఉంటుందా? అనేది కీలక ప్రశ్న. గతంలో అయితే.. టీడీపీ నియమించిన.. చైర్మన్, డిప్యూటీ చైర్మన్లు ఉన్నారు.కానీ, ఇప్పుడు మొత్తంగా వైసీపీ నేతలే అక్కడ కనిపించనున్నారు. దీంతో టీడీపీకి ఇబ్బందులు తప్పవని కొందరు చెబుతున్నారు.
ఇక, ప్రస్తుతం టీడీపీకి మండలిలో ఉన్న నేతల విషయాన్ని చూస్తే.. ఇటీవల రిటైరైన.. బుద్ధా వెంకన్న, బీటెక్ రవి వంటివారు.. ఫైర్ బ్రాండ్ నేతలుగా ఉన్నారు. వీరి రిటైర్మెంట్ సహా.. మరికొందరు పోతుల సునీత, మాణిక్యవరప్రసాద్, శమంతకమణి వంటివారు.. మండలికి దూరం కావడంతో టీడీపీకి సహజంగానే మెజారిటీ తగ్గింది. అయినప్పటికీ.. యనమల రామకృష్ణుడు , నారా లోకేష్ , పరుచూరి అశోక్‌బాబు వంటి వారు దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం.మరి ఏమేరకు దూకుడు ప్రదర్శిస్తారో.. వర్షాకాల సమావేశాల్లో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి