ఏపీలో వైసీపీ నాయ‌కులు చేస్తున్న ప‌నులు.. ప్ర‌భుత్వానికి.. ప్ర‌భుత్వ అధినేత సీఎం జ‌గ‌న్‌కు పెద్ద త‌ల‌నొ ప్పిగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన పోలీసు శాఖ‌పై అధికార పార్టీ నేత‌లే.. నోరు పారేసుకోవ‌డం.. బ‌హిరంగంగానే వారు దూషించ‌డం.. వంటివి స‌ర్కారును ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేస్తోంది. నిజానికి పోలీసుల వైపు నుంచి ఏదైనా పొర‌పాటు జ‌రిగితే.. దానిని స‌రిదిద్దుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. హోం మంత్రికి ఫిర్యాదు చేయొచ్చు. స్వ‌యంగా డీజీపీకి ఫోన్ చేసి మాట్లాడొచ్చు. లేదా.. కేబినెట్ మీటింగ్‌లో నేరుగా సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లొచ్చు.

అయితే.. ఇవ‌న్నీ.. వ‌దిలేసి.. క్షేత్ర‌స్థాయిలో కీల‌క‌మైన నేత‌లే.. పోలీసుల‌పై విరుచుకుప‌డుతున్న ఉదంతా లు క‌నిపిస్తున్నాయి. ఇవి అంతిమంగా ప్ర‌తిప‌క్షాల‌కు ఆయుధాల‌ను అందించ‌డ‌మే కాకుండా.. సీఎం చుట్టూ వివాదాలు ముసురుకునేలా చేస్తున్నాయి. తాజాగా మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు.. విశాఖ‌లోని శార‌దా పీఠం ద‌గ్గ‌ర బుధ‌వారం చేసిన యాగీ.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. స‌హ‌జంగా ముఖ్య‌మంత్రి వ‌స్తున్న ప్పుడు.. ప్రొటోకాల్‌ను ప‌టిష్టంగా అమ‌లు చేస్తారు. ఈ క్ర‌మంలో శార‌దా పీఠం వ‌ద్ద‌కూడా అదే ప్రొటోకాల్‌ను అమ‌లు చేశారు.

ఈ క్ర‌మంలో మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు త‌న అనుచ‌రుల‌తో వ‌చ్చారు. మంత్రిని అనుమ‌తిస్తామ‌న్న సీఐ.. ఇత‌ర నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను అనుమ‌తించేది లేద‌న్నారు. ఈ క్ర‌మంలో సీఐ త‌న‌ను దూషించార‌ని.. మంత్రి పేర్కొన్నారు. దీంతో ఆయ‌న‌పై విరుచుకుప‌డ్డారు. నా కొడ‌కా.. అన్నార‌ని.. సోష‌ల్‌మీడియాలో వీడియో స‌హా వైర‌ల్ అయింది. దీంతో ఇది రాజ‌కీయంగా వివాదానికి దారితీసింది. నిజానికి వైసీపీ అదికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇదొక్క‌టే కాదు.. ప‌లు సంద‌ర్భాల్లో కీల‌క నాయ‌కులు.. పోలీసులపై విరుచుకుప‌డ్డారు.

గ‌తంలో నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్ర‌స‌న్న కుమార్‌రెడ్డి ఏకంగా జిల్లా ఎస్పీకే వార్నింగ్ ఇచ్చారు. త‌ర్వాత‌.. ఆయ‌న‌ను అక్క‌డ నుంచి పంపించేశారు. గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు కూడా త‌న మాట వినిపించుకోవ‌డం లేద‌ని.. సీఐని దూషించి.. ట్రాన్స్ ఫ‌ర్ చేశారు. దీనికి ముందు.. కృష్నాజిల్లా పెడ‌న ఎమ్మెల్యే కూడా స్థానిక సీఐపై రుస‌రుస లాడారు. టీడీపీ చేస్తున్న ఇసుక ఉద్య‌మానికి ప‌ర్మిష‌న్ ఇవ్వ‌డాన్ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. నీలాంటి టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్యోగాలు ఎవ‌రు ఇఇచ్చారంటూ.. ఆయ‌న విరుచుకుప‌డ్డారు.

అయితే.. సంద‌ర్భం ఏదైనా.. నాయ‌కులు ఎవ‌రైనా.. పోలీసుల‌ను దూషిస్తున్న ఘ‌ట‌న‌లు.. జ‌గ‌న్‌కు ఇబ్బందిగా మారాయ‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇవి ప్ర‌తిప‌క్షాల‌కు వ‌రంగా మారి.. వారికి ఆయుధాల‌ను అందిస్తున్నాయి. మ‌రి ఇప్ప‌టికైనా నాయ‌కులు త‌మ ప‌ద్ధ‌తి మార్చుకుంటారో లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: