యస్ ఇప్పుడు అందరు ఇదే మాట అంటున్నారు.  జగన్ కోసం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బాగానే కష్టపడుతున్నారు...టీడీపీ-జనసేన కలవకుండా జగన్‌కు సాయం చేసేందుకు సోము పనిచేస్తున్నారని అందరికీ అనుమానం వస్తుంది..అయితే అనుమానమే కాదు ఇది నిజమే అని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు..మొదట నుంచి సోము వీర్రాజు, జగన్‌కు అనుకూలమైన మనిషి అనే సంగతి అందరికీ తెలుసని చెబుతున్నారు. వాస్తవానికి చూస్తే సోము వీర్రాజు...జగన్‌ని ఎప్పుడు డైరక్ట్ గా విమర్శించలేదు..ప్రభుత్వం పరంగా విమర్శిస్తున్నారు తప్ప..డైరక్ట్ గా జగన్‌ని మాత్రం ఒక్క మాట అనరు..కానీ చంద్రబాబు పేరు తీసి మాత్రం సోము ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు...అంటే పరోక్షంగా జగన్‌కు సాయం చేయడంలో సోము ఎప్పుడు ముందు ఉంటారనే చెప్పొచ్చు.

ఇప్పుడు కూడా సోము అదే పనిలో ఉన్నారని తెలుస్తోంది...ఇటీవల కాలంలో టీడీపీ-జనసేన పొత్తు గురించి చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే...పొత్తుకు ఇటు చంద్రబాబు గాని, అటు పవన్ కల్యాణ్ గాని రెడీగానే ఉన్నారు...అయితే టీడీపీతో పొత్తుకు మాత్రం బీజేపీ ఒప్పుకోవడం లేదు..చంద్రబాబుని కలుపుకునే ప్రసక్తి లేదని కొందరు బీజేపీ నేతలు చెబుతున్నారు..ముఖ్యంగా సోము వీర్రాజు, జి‌వి‌ఎల్ నరసింహరావు లాంటి వారు మాట్లాడుతున్నారు.

అంటే టీడీపీ-బీజేపీ కలవకూడదని వారు అనుకుంటున్నారు..అదే సమయంలో టీడీపీతో జనసేనని కూడా కలవనివ్వకుండా చేయాలనేది సోము ప్లాన్‌గా కనిపిస్తోంది..ఎలాగైనా పొత్తుని చెడగొట్టి జగన్‌కు పరోక్షంగా లాభం కలిగించాలనేది సోము ఉద్దేశంగా కనిపిస్తోంది...టీడీపీ-జనసేన కలిస్తే వైసీపీకి రాజకీయంగా అనేక ఇబ్బందులు ఉంటాయి...కేవలం పొత్తు ప్రభావంతో ఓడిపోయే వైసీపీ సీట్ల సంఖ్య ఎక్కువగానే ఉంది..అలాంటప్పుడు పొత్తు లేకపోతేనే వైసీపీకి ప్లస్..అందుకే టీడీపీని జనసేన కలవనివ్వకుండా చేయాలని చెప్పి వైసీపీ నేతలు తమదైన శైలిలో రాజకీయం చేస్తున్నారు.

ఇక వారికి సపోర్ట్‌గా సోము వీర్రాజు కూడా పనిచేస్తున్నారని, చంద్రబాబు-పవన్ కలిస్తే జగన్‌కు రాజకీయంగా ఇబ్బంది వస్తుందని తెలిసి...పొత్తు లేకుండా చేసేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారని తమ్ముళ్ళు అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: