పోలవరం ప్రాజెక్టు.. ఏపీకి జీవనాడిగా చెప్పుకునే ప్రాజెక్టు.. కానీ.. ఇది ఎప్పడుు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. గతంలో చంద్రబాబు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తానని చెప్పుకున్నారు. అయితే.. ఆ పరుగులు పెట్టే తొందరలో ఆయన చారిత్రక తప్పిదం చేసారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు వైసీపీ సర్కారు అదే చెబుతోంది. కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తి కాకుండానే చంద్రబాబు డయాఫ్రం వాల్ నిర్మించడం వల్లే ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఇప్పడు వైసీపీ సర్కారు చెబుతోంది.


చంద్రబాబు సర్కారు తొందరపాటు చర్యతో రూ. 400 కోట్లు వృధా అయ్యే పరిస్థితి ఉందని జలవనరుల మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడం వల్ల రూ. 16,000  కోట్లు ఉన్న ప్రాజెక్టు వ్యయం నేడు రూ. 47,000 కోట్లకు చేరిందని అంబటి రాంబాబు అంటున్నారు. ప్రాజెక్టు జంట సొరంగా వెడల్పు అంశం ప్రక్రియ పరిశీలనలో ఉందని చెబుతున్నారు. ఆర్ అండ్ ఆర్ కాలనీల పనులను దశలవారీగా పూర్తి చేస్తున్నామని అంబటి అంటున్నారు.


పోలవరం నిర్వాసితులకు పరిహారం ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి అంబటి చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ 2019, 2020 సంవత్సరాల్లో వచ్చిన వరదలు కారణంగా దెబ్బతిందని.. అందుకే ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు. డయాఫ్రం వాల్ సమస్య రాష్ట్ర పరిధిలోని కాదని సిడబ్ల్యుసి, పీపీఏ, డి డి ఆర్ సి ల స్థాయిలో నిర్ణయించాల్సింది అంబటి అన్నారు.


సాధ్యమైనంత త్వరలో ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. తమ ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి నీళ్లు అందిస్తామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి గతంలో జరిగిన తప్పిదాలకు చంద్రబాబే కారణం అన్నారు. ప్రపంచంలోనూ దేశంలోనూ ఎక్కడ డయాఫ్రం వాల్ దెబ్బతిన్న ఘటనలు లేవని ఒక పోలవరం లో మాత్రమే జరిగిందని అంబటి గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: