రష్యా.. ప్రపంచంలోనే అత్యున్నత సైనిక బలగాలు కలిగిన దేశం. టెక్నాలజీలో ఎంతో ముందున్న దేశం. అందులోనూ ఇండియాకు అత్యంత నమ్మకమైన మిత్ర దేశం రష్యా. అందుకే ఎప్పటి నుంచో రష్యాకు ఇండియాతో సైనికపరంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇండియాకు ప్రధానంగా ఆయుధాలు సరఫరా చేసే దేశం కూడా రష్యాయే. అయితే.. ఇప్పుడు ఈ రెండు దేశాలు రక్షణ రంగంలో సహకరించుకుంటున్నాయి.


రక్షణ రంగాన్నిబలోపేతం చేసుకునేందుకు భారత్‌-రష్యా కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. తాజాగా ధ్వని వేగం కంటే 5 రెట్లు వేగంతో ప్రయాణించే హైపర్‌సోనిక్‌ క్షిపణి ప్రయోగాల్లో ఈ రెండు దేశాలు ముందడుగు వేస్తున్నాయి. రష్యా సహకారంతో హైపర్‌ సోనిక్‌ క్షిపణులు మరో ఐదారేళ్లలో దేశీయంగా తయారు చేస్తామని మన దేశానికి చెందిన బ్రహ్మోస్‌ ఎయిర్‌ స్పేస్‌ వెల్లడించింది. ధ్వని కంటే 5 రెట్ల వేగంతో దూసుకెళ్లడం ఈ  హైపర్‌ సోనిక్‌ క్షిపణుల ప్రత్యేకత.


ఇప్పటి వరకూ ఈ క్షిపణులను ఇండియా దిగుమతి చేసుకుంటోంది. కానీ ఇప్పుడు రష్యా సాయంతో ఈ క్షిపణులను మరో ఐదారేళ్లలో దేశీయంగానే తయారు చేస్తామని బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ చెబుతోంది.  హైప‌ర్ సోనిక్ మిస్సైళ్లను త‌యారు చేసే సామ‌ర్థ్యం త్వరలోే బ్రహ్మోస్ ఏరోస్పేస్‌ సంపాదిస్తుందని ఆ సంస్థ చెబుతోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ, వేగవంతమైన, అత్యంత శక్తివంతమైన, కచ్చితత్వమైన ఆధునిక ఆయుధాల్లో ఈ బ్రహ్మోస్‌ క్షిపణులు ఒకటి. అందుకే దానికి అంత ప్రాధాన్యం.


మేక్ ఇన్ ఇండియా, డిజైన్ ఇన్ ఇండియా నినాదాలతో ఇప్పుడు బ్రహ్మోస్ ఏరోస్పేస్ దేశీయంగానే  హైపర్‌ సోనిక్‌ క్షిపణుల తయారీకి పూనుకుంది. ఈ హైపర్‌ సోనిక్‌ ఆయుధాలు రాబోయే మూడు నుంచి ఐదేళ్లలో ఉత్పత్తికి సిద్ధంగా ఉంటాయి. ఈ బ్రహ్మోస్‌ హైపర్‌సోనిక్‌ క్షిపణులు దేశీయంగా అందుబాటులోకి వస్తే ప్రపంచంలోని అగ్రశ్రేణి రక్షణ వ్యవస్థ కలిగిన దేశాల సరసన భారత్‌ కూడా సగర్వంగా నిలబడుతుంది. మనం తయారు చేసుకోవడమే కాదు.. ఇతర దేశాలకూ ఎగుమతి చేసేలా  బ్రహ్మోస్ ప్రణాళికలు రూపొందిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: