కొడంగల్‌.. రేవంత్ రెడ్డి సొంతగడ్డ.. అక్కడ నుంచి ఆయన అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. అయితే.. ఆ తర్వాత మల్కాజ్ గిరి నుంచి ఎంపీ అయ్యారు. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు అయ్యాక సొంత గడ్డపై ఫోకస్ పెట్టారు. తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో పలువురు తెరాస, బీజేపీ నేతలు, యువకులు చేరారు. కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలానికి చెందిన 60మంది తెరాస, బీజేపీ నేతలు కాంగ్రెస్‌లో చేరారు.

ఈ సందర్భంగా కండువా కప్పి వారిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్‌, బీజేపీలపై ఫైర్ అయ్యారు. మద్దూరు, గోకుల్ నగర్, సీతనాయక్ తండా నుంచి యువకులు కాంగ్రెస్‌లో చేరడం సంతోషమన్న రేవంత్ రెడ్డి.. మద్దూరు మండలంలో తాగునీరు, రోడ్లు, విద్య, విద్యుత్ సదుపాయాలను నా హయాంలో కల్పించానన్నారు. కొడంగల్‌లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్దేనని.. అధికార పార్టీ ఎమ్మెల్యే అక్కడ తట్టెడు మట్టి కూడా తీయలేదని.. అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో ఏ మారుమూల పల్లెలో అడిగినా చెబుతారని రేవంత్ రెడ్డి అన్నారు.


కొడంగల్ ప్రజలను ఒకటే కోరుతున్నా.. నాలుగున్నరేళ్లుగా టీఆరెస్ ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి చేయలేదు.. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు మనం సంతకం పెడితే ఎమ్మెల్యే టికెట్ వస్తుంది.. ఆ అవకాశం సోనియా గాంధీ మన కొడంగల్‌కు ఇచ్చారు.. కేసీఆర్, మోదీ కలిసి కృష్ణా-వికారాబాద్ రైలును మనకు రాకుండా ఆపారు.. గతంలో కొడంగల్ గౌరవం ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి.. 5వేల ట్రాన్స్ ఫార్మర్లు తెచ్చి గ్రామ గ్రామాన ఏర్పాటు చేశాం.. ఎన్నో సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశాం.. డ్రామారావు మాటలు నమ్మి తెరాసను గెలిపిస్తే ఏం జరిగిందో మీరు చూశారు.. తెరాస నేతలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు.. పోలీస్ స్టేషన్లు పైరవీకారులకు అడ్డాగా మారాయి.. సరైన నాయకత్వం లేకపోవడమే ఇందుకు కారణం.. మండలాలు వాడు, వీడు ఇచ్చుడు కాదు.. అధికారంలోకి వచ్చాక కొడంగల్‌ను మనం రెవెన్యూ డివిజన్ చేసుకుందామని రేవంత్ రెడ్డి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: