
చైనా తో రష్యా కలిస్తే మనం వాళ్ళతో కలవలేం. అందులో వీళ్ళందరూ కలిసి సైనిక అలయన్స్ పెట్టుకుంటారనే ఇష్యూ వచ్చింది. అయితే రష్యా భారత్ కు అభియమిచ్చింది, మేము స్నేహపూర్వకంగా ఉంటున్నాం కానీ సైనిక పరమైన అలయన్స్ ఏమీ కట్టమని చెప్పింది అది. ఒకరకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ సర్కార్ గట్టిగా ప్రెజర్ పెట్టేదీ అదే.
ఆయిల్ మనం ఎక్కువగా కొంటున్నాం. ఏడాదికి 4 లక్షల కోట్ల ఆయిల్ కొంటున్నాం . ఆ దశలో ఇంకా మనం వ్యాపారాలు పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాం. చైనా వాళ్లు కానీ కలిస్తే కనుక మనకు తలనొప్పి. ఈ విషయంలోనే రష్యా తేల్చి చెప్పేసింది. చైనాతో సైనిక పరమైన కూటమి లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. సైనిక సహకారం విషయంలో తాము ఏదీ దాచడం లేదని పుతిన్ అన్నారు.
ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ సందర్భంగా పుతిన్ మరియు అతని చైనా మిత్రుడు జింపింగ్ తమ స్నేహాన్ని చాటుకున్న తర్వాత రష్యా అధ్యక్షుడి నుండి ప్రకటన వచ్చింది. మాస్కోతో వారి మునుపటి సంబంధాలు మరింత సన్నిహితమయ్యేలా ప్రతిజ్ఞ చేశారు. చైనా అధ్యక్షుడు వెళ్లి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యన అలయన్స్ గురించి ఒక స్పష్టత ఇచ్చేశాడు. దాంతో మేము స్నేహపూర్వకంగా ఉంటున్నాం తప్పించి ఒక కూటమిగా అయితే ఉండాలనుకోవడం లేదు అని ఒక స్పష్టత అయితే ఇచ్చేసాడు.