స్టూడియో పనికి కాకుండా రియల్ ఎస్టేట్ కు అమ్ముకుంటుంటే అది నేరమేనని అప్పుడు ప్రభుత్వం దాన్ని స్వాధీన పరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయా నాయకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు. ప్రభుత్వానికి, సురేశ్ బాబు తో ఎమైనా అండర్ స్టాండింగ్ కుదిరిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లేదా ఆ పత్రికకు సంబంధించి సంతృప్తి పరిచే పని ఏదైనా చేయడం లేదా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సురేశ్ బాబు కు అప్పట్లో రూ.200 కోట్ల విలువైన భూమిని రూ. 2 కోట్లకే కట్టబెట్టారనే ఆరోపణలు వచ్చాయి. భూమి ఇచ్చిన సమయానికి ఇప్పటికీ రెండు రేట్ల ఎక్కువగా ధర పలుకుతోంది. మొత్తంగా ప్రస్తుతం ఇప్పుడు రూ. 2 వేల కోట్ల విలువైన భూమి గా ఇది ఉందని తెలుస్తోంది.
అయితే ఇంత జరుగుతున్న ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సినిమాటోగ్రపీ మంత్రి, ఏపీఐఐసీ అధికారులు, నాయకులు పట్టించుకోకపోవడానికి కారణాలు ఏంటీ. మంత్రి రోజా సినిమా రంగంలో ఉన్నారు కాబట్టి చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
అసలు స్టూడియోను రియల్ ఎస్టేట్ రంగానికి ఎలా అమ్ముతారు. అలా అమ్మడానికి ఏమైనా అనుమతులు ఉన్నాయి. లేకుండా అలా ఎలా చేస్తారు. ఒక వేళ అనుమతులు ఉంటే ఎప్పుడొచ్చాయి. ఎవరిచ్చారు. ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు రావాల్సిన అవసరముంది. దాదాపు రూ. 1000 కోట్ల భూముల విషయంలో ప్రభుత్వం స్పందన గురించి అందరూ వేచి చూస్తున్నారు. మరి ప్రభుత్వం సైలెంట్ గా ఉండటానికి కారణాలు ఏమిటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి