తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్లు టార్గెట్ చేస్తున్నారని తెలుసు కానీ అక్కడ గెలవడం కోసమే టిఆర్ఎస్ అలా చేస్తుందని భావిస్తున్నారు ఆంధ్రాలో ఉన్నటువంటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. ఏదో మొహమాటానికి చిన్న చిన్న స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అంతే కానీ వీళ్ళలో ఆవేశంగా మాట్లాడుతూ నోరు జారినటువంటి సీదిరి అప్పలరాజు లేదా ప్రాక్టికల్ గా మాట్లాడినటువంటి పేర్ని నాని లను పక్కన పెడితే ఎవరు వివరంగా చెప్పే వాళ్ళు లేరని తెలుస్తుంది, తెలంగాణకు సంబంధించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ వాళ్లు అయితే మాత్రం ఒక్కొక్కటి వివరంగా చెబుతున్నారు.


అయితే వీళ్ళు ఇంత వివరంగా చెప్తూ ఉండడంతో, వీళ్లు కొంత ఆవేశంగా ఉన్నట్టున్నారని కొంతమంది భావిస్తున్నారు. ఎందుకంటే నాయకుల్లో కదలికలు లేనప్పుడు కార్యకర్తల్లో ఆత్మ గౌరవ నినాదాలు ఉంటాయనుకుంటా అని కొంత మంది రాజకీయ విశ్లేషకుల భావన. అలాంటి నినాదాలలో తాజాగా అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ కి సంబంధించిన లెక్కలు ఒకటి అని తెలుస్తుంది.


తాజాగా అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ కి సంబంధించిన డేటా ప్రకారం లాస్ట్ 3 ఏళ్లలో ఆంధ్ర ప్రదేశ్ 72 శాతం గ్రోత్ సాధించిందని అది కూడా వ్యవసాయ ఎగుమతుల్లో గ్రోత్ సాధించిందని చెప్తున్నారు. 2018-19 లో ఆంధ్రప్రదేశ్ నుండి అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ 2,694 మిలియన్ డాలర్లు అంటే 48,490 కోట్లు, 2021- 22 లో 52,079 కోట్లు ఎక్స్పోర్ట్ రూపంలో జమయిందని చెప్తున్నారు. అంటే 6,439 డాలర్లు ఆ సంవత్సరంలో వచ్చిందట.


అదే సందర్భంలో తెలంగాణలో అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ 2021-22 లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో 52,079 కోట్లు వస్తే, తెలంగాణలో మాత్రం 10,373 కోట్లు ఎగుమతులు మాత్రమే జరిగాయి. ఈ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ లెక్కలు చూస్తుంటే, ఆ ఎక్స్పోర్ట్స్ రూపంలో వచ్చినటువంటి లాభాల ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ముందంజలో ఉందని తెలుస్తుంది. అంటే ఎవరు లాభపడుతున్నారు, ఎవరు బాగుపడుతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: