కానీ ఆ సంస్థ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కాకినాడకు సమర్పించిన చిట్ వేలం రికార్డుల్లో అందుకు విరుద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఆ సంస్థ ప్రతి నెలా చిట్ వేలాన్ని నిర్వహించడం లేదనేది వెల్లడైంది. 2022 జనవరి నుంచి 2023 జనవరి వరకు రికార్డులను పరిశీలిస్తే ఒక్క నెల తప్ప మిగతా అన్ని నెలల్లో తక్కువ చిట్ వేలమే నిర్వహిస్తోంది. ఈ కంపెనీ టర్నోవర్ బ్యాంకు మొత్తాల్లో తేడాలు ఉన్నట్లు తెలిపింది.
ప్రతి నెలా రూ.7.61 కోట్ల మేర టర్నోవర్ ఉందని కంపెనీ చెబుతుంది. డివిడెంట్ మొత్తం మినహాయిస్తే ప్రతినెలా రూ. 5 కోట్ల చొప్పున 60 కోట్ల వరకు జమ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ జమ చేస్తున్న మొత్తం దరిదాపుల్లో లేదు. చిట్టిల వేలం సొమ్ము జగజ్జననీ కంపెనీ విషయంలో నల్లధనం కనిపిస్తోందని తెలిపింది. మొత్తం 49 చిట్టి పాటల ఫ్రైజ్ మనీ మొత్తం రూ. 11.76 కోట్లు చెల్లింపులు పరిశీలించారు.
21 చిట్టి పాటల మనీ రూ. 4.68 కోట్లుగా ఉన్నట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. మిగతా రూ.7.8కోట్ల ప్రైజ్ మనీని నగదు రూపంలో చెల్లించినట్లు తెలిపింది. దీంతో చిట్ ఫండ్ వ్యవహారాల్లో నల్లధనం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోందని చెప్పారు. నగదు రూపంలో చెల్లించడం నిబంధనలకు విరుద్ధమని ప్రకటించింది. చిట్ ఫండ్ కంపెనీ వ్యవహారాలు, చందాల వసూలు అన్ని నగదు రూపంలోనే చెల్లిస్తోంది. ఇది ఆదాయ పన్ను చట్టానికి విరుద్ధం. జగజ్జననీ కంపెనీ సరిగా వ్యవహరించలేదని సీఐడీ తేల్చి చెప్పింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి