రామ్ గోపాల్ వర్మ జగన్ ను జైలుకి పంపిస్తామని బెదిరించిన విధానం, జగన్ వాటిని ఎలా ఎదుర్కొన్నారు. ఏ విధంగా పార్టీ పెట్టారు. జగన్ కు భారతి ఇచ్చిన సపోర్టు, జగన్ ఎలా ఎక్సర్ సైజు చేస్తారు. ఇలా కొన్ని విషయాలను ట్రైలర్ లో చూపించారు. ఇందులో ముఖ్యంగా చంద్రబాబును విలన్ గా చూపించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ గురించి ఆయన తీసుకున్న నిర్ణయాలపై చంద్రబాబు అడ్డుకున్న వివాదం తదితర అంశాలతో సినిమాను తీసిన విషయం తెలిసిందే.
గతంలో కడప ప్యాక్షనిస్టుల విషయంలో తీసిన సినిమాలు, అమ్మ రాజ్యంలో రెడ్లు, రక్త చరిత్ర తదితర సినిమాలు ట్రెండ్ ను కొన్ని విషయాలను తెలియజేశాయి. ప్రస్తుతం తీసిన ఈ సినిమా జగన్ కు అనుకూలంగా ఉంటుందనే తెలుస్తోంది. చంద్రబాబును విలన్ గా చూపించడం, జగన్ అప్పటి కాంగ్రెస్ అధినాయకత్వంతో పోరాడిన సన్నివేశాలు, ఆ తర్వాత పార్టీ పెట్టడం, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, చివరకు విజయం సాధించి సీఎంగా నిలవడం అనే ఉండే అవకాశం ఉంది.
ఇదే సమయంలో జగన్ పై ఎవరు కుట్రలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నంత కాలం ఎలా ఉన్న వ్యక్తులు ఎలా మారిపోయారన్నది ఈ సినిమాలో ఉండనుందని తెలుస్తోంది. మొత్తం మీద వర్మ ఏదీ చేసినా సంచలనంగా ఉంటుందనేది నిజం. మరి ఈ సినిమా పై ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి