ఎగ్జిట్ పోల్స్ కానీ ఫ్రీ పోల్స్ అన్ని సార్లు నిజం కావు. కొన్ని సార్లు నిజం కూడా అవుతాయి. కొన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీల అభ్యర్థుల గెలుపొటముల గురించి సర్వేలు చేయించుకుంటాయి. అలా కాకుండా కొన్ని మీడియా చానల్స్ ఎన్నికలకు ఆరు నెలల ముందు పార్టీల భవితవ్యం ఎలా ఉండబోతుంది అని సర్వేలు చేస్తుంటాయి.


అయితే ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గతంలో ఆరు నెలల ముందుగానే ఆంధ్రలో ఏ పార్టీ గెలుస్తుంది.. ఎవరూ సీఎం అవుతారనే ఒకసారి.. ఎన్నికలకు వారం రోజుల ముందు మరోసారి ఫ్రీ పోల్ సర్వే చేసేవారు. అప్పట్లో ఆయన చెప్పినటువంటి పేపర్ క్లిప్పింగ్ లు కూడా వైరల్ అవుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు 2018 లో ఆరు నెలల ముందు ఆంధ్రజ్యోతి ఇచ్చిన సర్వేలో వైసీపీ 39.1 శాతం ఓట్లు దాదాపు 30 సీట్లకు పరిమితమవుతుందని తెలిపింది.


అయితే  2014 ఎన్నికలలోనే వైసీపీకి 44 శాతం పైగా ఓట్లు వచ్చాయి. అవి 39 శాతానికి పడిపోతాయని పేర్కొంది. 2019 కు ముందు  తెలుగుదేశంకు వచ్చే సరికి 46.47 శాతం ఓట్లు 140 పైగా సీట్లు వస్తాయని చెప్పుకొచ్చారు. వారం రోజుల ముందు జ్యోతి జర్నలిజంకు చెందిన వారు చేసిన సర్వేలో  వైసీపీకి 45 నుంచి 50 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని 3 నుంచి 5 ఎంపీ స్థానాలకు పరిమితం అవుతాయని పేర్కొన్నారు.


అదే సందర్భంలో టైమ్స్ నౌ మాత్రం వైసీపీకి 20 ఎంపీ స్థానాలు వస్తాయని చెప్పింది. తెలుగుదేశం 5 స్థానాలు గెలుస్తుందని పేర్కొంది. అయితే టైమ్స్ నౌ ఇప్పుడు ఇస్తున్న సర్వేలకు సంబంధించి జ్యోతి మీడియా అవన్నీ తప్పని చెబుతోంది. మరి గతంలో టీడీపీ అనుకూలంగా సర్వేలు చేసి టీడీపీ నాయకులను మోసం చేసినపుడు వారు ఓటమి చెందినపుడు చేసిన సర్వేలు అన్ని ఎలాంటివో ఒక సారి ఆత్మవిమర్శ చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: