చంద్రుడిపై చంద్రయాన్ 3 అడుగుపెట్టగానే ప్రపంచవ్యాప్తంగా మొత్తం చూపు భారత్ పైనే ఉంది. చంద్రయాన్ 2  ఫెయిల్యూర్ తర్వాత చంద్రయాన్ 3  కోసం ఇస్రో సైంటిస్టులు చాలా కష్టపడ్డారు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు.ఎలాగైనా సరే చంద్రుడిపై విక్రం ల్యాండర్ ని దించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.  అందులో భాగంగా ఒక్కో టీం ఒక్కో విభాగానికి పూర్తి రక్షణగా పర్ఫెక్ట్ గా ఖచ్చితత్వంతో పనిచేసి చంద్రుడు మీద విక్రం ల్యాండర్ ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. అయితే అమెరికా అపోలో 13 మిషన్ ద్వారా గతంలోనే చంద్రుడి పైకి మనుషులను పంపింది. కానీ ఇండియా దక్షిణ ధ్రువం వైపు చంద్రుడిపై నీటి జాడలను కనుక్కోవడానికి చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చేపట్టింది.


ఇంతవరకు బాగానే ఉంది. కానీ మనుషుల ప్రవర్తనలో మాత్రం సరికొత్త విధానాలు కనిపిస్తున్నాయి. అమెరికా అపోలో 13 విజయవంతం తర్వాత లూనార్ రిజిస్ట్రీ అని ఒక వెబ్  సైట్ తీసుకువచ్చింది. అందులో చంద్రమండలంపై భూమి కొనుగోలు చేయవచ్చని తెలిపింది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాకు చెందిన సాయి విజ్ఞత అనే అమ్మాయి చంద్రుడిపై ఎకరం భూమి 2022లో కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఆగస్టు 23, 2023 నాడు పూర్తయింది. ఇప్పుడు ఇది పూర్తి వైరల్ గా మారింది.


చంద్ర మండలంపై ఎకరం భూమి దాదాపు 35 లక్షలకు కొనుగోలు చేసినట్లుగా రిజిస్ట్రేషన్ లో పేర్కొన్నారు దీంతో ఈ వార్త వైరల్ అవుతుంది. చంద్రమండలం పైన ఎవరికి హక్కు లేదని గతంలో చెప్పినప్పటికీ అమెరికా ఎకరం భూమికి 35 లక్షలు తీసుకొని ఎలా అమ్మిందని విమర్శలు వస్తున్నాయి.  పెద్దపల్లి జిల్లాకు చెందిన విజ్ఞత కూడా  చంద్రుడిపై భూమి తన తల్లిదండ్రుల కోసమే కొన్నానని అది తన చిరకాల కోరిక అని ఆమె తెలపడం ఇక్కడ కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి: