అయితే సచివాలయానికి ఒక వ్యక్తి వెళ్లి తన భూమి సర్వే పేపర్ ఇవ్వమని అడిగితే తనకున్న భూమి కంటే ఎకరంన్నర ఎక్కువగానే సచివాలయ ఉద్యోగులు రాసిచ్చారు. అయితే ఆ 80 ఏళ్ల వృద్ధుడు నాకున్న భూమి తక్కువని ఇంత ఉండదని చెప్పాడు. కావాలంటే ఆధార్ అనుసంధానం ద్వారా చూడాలని కోరాడు. అయితే ఈయన ఆధార్ నెంబర్ కు వేరే మహిళ భూమి యాడ్ అయి ఉంది.
దీంతో కంగుతిని సచివాలయ ఉద్యోగిని ప్రశ్నిస్తే ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లాలని చెప్పారు. ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లి అడిగితే అక్కడ సచివాలయంలో నే డాటా ఉంటుంది అక్కడికి వెళ్లాలని అన్నారు. ఇలా అంటున్నారని తెలిసిన వ్యక్తిని సంప్రదిస్తే మీ సేవకు వెళ్లి దరఖాస్తు చేయాలని సూచించారు. అయితే ఆ భూమిపై పేరు మార్చాలంటే వీఆర్ఓ మార్చాలని చెప్పాడు. అయితే ఆ వీఆర్ఓకు డబ్బులివ్వకపోతే పని జరగదని అన్నారు. మొత్తం మీద అక్కడ ముగ్గురు ఆధార్ లు మార్చాల్సి వస్తుంది.
మొత్తం వ్యవస్థను నాశనం చేసేశారు. పూర్వం ఊళ్లలో ప్రెసిడెంట్, నాయకులు అంటే కాస్త భయపడేవారు. ఇప్పుడు ఆ భయం కూడా లేకుండా చేస్తున్నారు. సచివాలయాల దగ్గర కూడా పని జరగడం లేదు. అయితే పని కోసం వెళితే ఒకరి మీద ఒకరు పని మాది కాదని తప్పించుకుంటున్నారు. దీన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది అక్రమార్కులు డబ్బులు సంపాదించుకుంటున్నారు. దీనిపై వైసీపీ సర్కారు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి