షాపూంజీ పల్లోంజి కేసులో సంబంధించి చంద్రబాబు గురించి ఏపీ సీఐడీ చాలా వరకు సమాచారాన్ని సేకరించింది. ఈ కేసు విచారణ జరగకుండా కోర్టుల నుంచి స్టే తెచ్చుకుని టీడీపీ అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. అదే సందర్భంలో డేటా మొత్తం సీఐడీ ఉంచుకుంది. ఇందులో చాలా వివరాలను ఈడీ, సీబీఐకు కూడా జగన్ పంపించారు. చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని జగన్ కోరుతున్నారు. అయితే చంద్రబాబు ఎందుకు బీజేపీ తో పొత్తు కు తహతహలాడుతున్నారంటే కారణం ఇదేనని తెలుస్తోంది.


సుజనా చౌదరి, సీఎం రమేశ్ లాంటి వారు బీజేపీలోకి వెళ్లగానే వారికి సంబంధించిన బిజినెస్ లు గురించి ఈడీ, సీబీఐ లాంటివి విచారణ జరగడం లేదు. ఒకప్పుడు కేంద్రాన్ని తిట్టిపోసిన చంద్రబాబు మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్నారు. బీజేపీకి అయిదు ఎంపీ సీట్లు ఇస్తామని చంద్రబాబు చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. షాపూంజీ పల్లంజీకి సంబంధించి సాక్షి దాన్ని ప్రొజెక్టు చేసింది. మనోజ్ పార్థసాని కార్యాలయంలో ఐటీ సోదాలు చేసింది. అందులో ఆయన ఇచ్చిన సమాధానాలను రికార్డు చేసింది.


2019లో ఆయన స్టేట్ మెంట్ రికార్డు ఆధారంగా .. 2020 లో చంద్రబాబు పీఏ ఇంట్లో సోదాలు చేశారు. ఏపీ టిడ్కో ఇళ్ల నిర్మాణాల గురించి షాపూర్ జీ పల్లంజీకి సంబంధించి 1.4 లక్షల ఇళ్ల  నిర్మాణాన్ని 2017 లో దక్కించుకున్నారు. 2019 నాటికి అందులో 23 వేల ఇళ్లు మాత్రమే నిర్మించారు. అమరావతి రాజధాని నిర్మాణం గురించి జరిగిన పలు సమావేశాల్లో కలిశానని మనోజ్ చెప్పారు. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిని పరిచయం చేశారని తెలిపారు. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ చెప్పినట్లు నడుచుకోవాలని సూచించారు. శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఇచ్చిన కంపెనీల పేర్లతో ఉన్న వాటికి సబ్ కాంట్రాక్ట్ చేయాలని చెప్పారు. అంటే ఏపీ టిడ్కో ఇళ్ల నిర్మాణంలో చంద్రబాబుకు ఉచ్చు బిగుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: