మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే. అలాంటి హిట్ సినిమాలలో కొదమ సింహం సినిమా కూడా ఒకటి. చిరంజీవి మాట్లాడుతూ కౌబాయ్ సినిమాలు అంటే తనకు ఇష్టమని అలాంటి సినిమాలో తాను నటిస్తానని ఊహించలేదని చిరంజీవి పేర్కొన్నారు. ఈ నెల 21వ తేదీన కొదమ సింహం సినిమా రీరిలీజ్ కానుంది. ఈ సినిమాలో నా స్టిల్ బాగా పాపులర్ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
ఆ లుక్ ను నేను బాగా ఇష్టపడటం వల్ల నిర్మాతలు దాన్ని ఫ్రేమ్ చేసి కానుకగా ఇచ్చారని చిరంజీవి తెలిపారు. నేను కౌబాయ్ సినిమాలో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదని అప్పటికే కృష్ణగారు నటించిన మోసగాళ్లకు మోసగాళ్లు రికార్డులు సృష్టించిందని చిరంజీవి అన్నారు. అలాంటి నేపథ్యంలో మరో సినిమా చేయడం అంటే సాహసం అనే చెప్పాలని చిరంజీవి పేర్కొన్నారు. ఈ సినిమా తొలిసారి నేను గడ్డం పెంచి కనిపించిన సినిమా ఇది అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
మోహన్ బాబు నటించిన సుడిగాలి రోల్ నా ఫేవరేట్ అని ఆయన తెలిపారు. ఆ పాత్రకు మోహన్ బాబు తప్ప మరొకరు న్యాయం చేయలేరని అనిపించిందని ఆయన తెలిపారు. లెజెండరీ యాక్టర్ ప్రాణ్ తో కలిసి ఈ సినిమాలో నటించే ఛాన్స్ దక్కిందని ఆయన అన్నారు. ఒక హాలీవుడ్ మూవీ ఇన్స్పిరేషన్ తో స్టెప్స్ వేశానని ఆయన చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ కు ఈ సినిమా అంటే చాలా ఇష్టమని ఆయన తెలిపారు. ఈ సినిమా క్యాసెట్ పెడితే తప్ప రామ్ చరణ్ భోజనం చేసేవారని ఆయన తెలిపారు. ఈతరం ప్రేక్షకులు సైతం ఈ సినిమాను ఆస్వాదిస్తారని చిరంజీవి కామెంట్లు చేశారు. చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. చిరంజీవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి