అయితే పొత్తుల విషయంలో జనసేన అధినేత స్పష్టంగా ఉన్నట్లు కనిపిస్తున్నా అది ఆచరణలో పెడతారా.. లేదా అనేదే వాళ్ల పార్టీలోను చర్చ జరుగుతుంది. ఇప్పటికే పవన్ టీడీపీతో కలిసే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించాడు. అయితే ఎన్డీయే భాగస్వామి అయిన జనసేన ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుందని ప్రచారం జరుగుతున్నా.. అదేమీ లేదని పవన్ చెప్పారు. అయితే 2014 మాదిరిగా జనసేన, బీజేపీ, టీడీపీ ఎన్నికలకు వెళ్లేలా కృషి చేస్తానని చెప్తున్నారు.
ఈ విషయమై రెండేళ్ల క్రితమే బీజేపీ అధిష్ఠానంతో చర్చించానని పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో బీజేపీ పెద్దలు సానుకూలంగా ఉన్నట్లు లేరు. ఎందుకంటే ఎన్డీయే భాగస్వామి పక్షాలతో గత నెలలో సమావేశం ఏర్పాటు చేయగా.. దానికి టీడీపీ కి ఆహ్వానం అందలేదు. అలాగే పొత్తు పెట్టుకోవాలనుకుంటే ఆ పాటికే జనసేనతో పాటే తమ నిర్ణయాన్ని ప్రకటించేంది. ఈ విషయంలో జనసేన వకాల్తా పుచ్చుకొని బీజేపీని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారు.
ఇప్పుడు 2014 అంటే జనసైనికులు భయపడుతున్నారు. ఎందుకంటే ఆ ఎన్నికల్లో పవన్ పోటీ చేయకుండా బీజేపీ , టీడీపీ కూటమికి మద్దతిచ్చారు. ఇప్పుడు కూడా అలానే చేస్తారా.. బీజేపీని ఒప్పిస్తే జనసేనకు ఇచ్చే 25-30స్థానాల్లోనే కోత పడే అవకాశం ఉంది. జగన్ ను గద్దె దింపడమే నా లక్ష్యం అని పవన్ ప్రకటిస్తున్నారు. ఒకవేళ పవన్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటే అతడిని నమ్ముకున్న వారు దిక్కుతోచని స్థితిలో పడతారు. కాబట్టి జనసేనాని వీలైనంత త్వరగా తన నిర్ణయాన్ని ప్రకటించి సీట్లు, పొత్తులు, సీఎం షేరింగ్ వంటి అంశాల్లో ప్రజలకు కాదు ముందు జనసేన పార్టీ నాయకులకు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి