అయితే పవన్ కల్యాణ్ కు తెలంగాణలో సీఎం కేసీఆర్ ని గద్దె దించి ఆ పదవిని తాను చేపడదామనే ఆలోచన లేదు. ఏపీలో అయితే జగన్ ని గద్దె దించి తాను అధికారంలోకి రావాలి అనుకుంటున్నారు. ఇదే రెండు రాష్ట్రాలకు స్పష్టమైన తేడా. ఏపీలో మాదిరిగా ఇక్కడ అంత దూకుడు ప్రదర్శించక పోవచ్చు అనేది రాజకీయ విశ్లేషకుల వాదన.
తెలంగాణలో బీజేపీతో కలవడానికి కొన్ని నిర్ధిష్టమైన కారణాలు ఉన్నాయని జనసేన నాయకులు పేర్కొంటున్నారు. ఏపీలో జనసేన, టీడీపీ కూటమిలో బీజేపీని భాగస్వామ్యం చేయడం పవన్ లక్ష్యం. ఎందుకంటే కేంద్రం మద్దతు మాకే ఉంది. భవిష్యత్తులో జగన్ అవినీతి ని బయట పెట్టి జైలుకు పంపిస్తామనే ప్రచారం చేసుకోవచ్చు. వైసీపీ కూడా అంత దూకుడు గా కూటమిపై విమర్శలు చేయదు కాబట్టి. బీజేపీతో సంప్రదింపులు జరపకుండానే టీడీపీతో పొత్తును పవన్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఇంకా జనసేనను ఎన్డీయే తమ భాగస్వామి అని చెప్పి తెలంగాణ ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని ఆహ్వానించింది. అందుకే హైదరాబాద్ సభలో ప్రధాని మోదీతో కలసి పాల్గొన్నారు. దీంతో పాటు టీడీపీ కి కూడా కొన్ని సంకేతాలు పంపారు. ఎన్డీయేలో నా ద్వారాలు మూసుకుపోలేదు. సీట్ల పంపంకంలో ఏదైనా తేడాలు వస్తే నేనే బీజేపీతో కలుస్తాను అనే విషయాన్ని టీడీపీ పెద్దలకు చెప్పినట్లు కనిపిస్తోంది. మరొకటి మోదీతో వేదికను పంచుకోవడం ద్వారా పవన్ ప్రతిష్ఠ పెరుగుతుంది. ఈ కారణాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో పవన్ బీజేపీతో కలిశారు అన్నది జనసైనికుల వాదన.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి