అయితే చంద్రబాబు నాయుడుకు సంబంధించిన అంశాల్లో మాత్రం అన్ని అనుకూలంగా రాసే ఎల్లో మీడియా.. రిషి కొండ వద్ద సీఎం జగన్ క్యాంప్ ఆఫీసు నిర్మిస్తుంటే మాత్రం తట్టుకోలేక తీవ్ర విమర్శలు చేస్తుంది. మరి ఎందుకుంత కోపమో అర్థం కాని పరిస్థితి. మొన్నటి వరకు రిషి కొండ వద్ద మట్టి ని తవ్వి వేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని వివిధ కథనాలను ప్రచురించారు. ఇప్పుడు సీఎం క్యాంపు ఆఫీసుకు దాదాపు 493 కోట్లు ప్రజా సొమ్ము వృథాగా ఖర్చు పెడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు.
అసలు ప్రజా సొమ్మును దేనికి ఖర్చు పెడుతున్నారని కనీసం అవగాహన లేకుండాా బురద చల్లే విధంగా కథనాలు ప్రచురించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయం విశాఖలో నిర్మితమైతే మెట్రో సిటీ కి మరింత లుక్ వస్తుంది. విశాఖ ఎలాగో డెవలప్ సిటీ కాబట్టి పారిశ్రామిక పరంగా, పెట్టుబడుల పరంగా ఎంతో లాభం చేకూరుంతుంది. సీఎం ను వివిధ దేశాల పరిశ్రమల ప్రతినిధులు వచ్చినపుడు కూడా కలవడానికి సౌకర్యంగా ఉంటుంది.
ఇది కేవలం జగన్ కోసమే నిర్మించుకున్న విలాసవంతమైన భవనం కాదని టీడీపీ నాయకులు గుర్తుంచుకుంటే మంచిదని వైసీపీ నేతలు సూచిస్తున్నారు. సీఎం అధికారికంగా ఉండే దాన్ని రేపు ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఇబ్బంది పడకుండా పాలన సక్రమంగా నిర్వహించే విధంగా సరికొత్త బిల్డింగ్ కడుతున్నారు. దీనికి కూడా అనవసర రాద్దాంతం చేయడం ఎందుకని ప్రజలు వారిని ప్రశ్నిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి