తెలంగాణ సీఎం కేసీఆర్ అపర చాణక్యుడు. తనకు నష్టం కలిగించే విషయాన్ని ముందే పసిగట్టి అందుకు అనుగుణంగా వ్యూహ రచనలు చేస్తుంటారు. 2004లో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న సమయంలో వైఎస్ఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారని తెలిసి వ్యూహాత్మకంగా ప్రభుత్వం నుంచి బయటకి వచ్చారు. ప్రభుత్వానికి ఎసరు తెస్తున్నారని భావించి ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని, రేవంత్ రెడ్డిని ఇరికించి తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు లేకుండా చేశారు.


అలాగే తెలంగాణలో ఎదురు వస్తారని భావించిన నేతలందర్నీ తన వైపు తిప్పుకొని.. తనకు ఎదురు లేకుండా చేసుకున్నారు. కానీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విషయంలో కేసీఆర్ అంచనా తప్పినట్లుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.  తెలంగాణ ఎమ్మెల్యేల్లో ఆయన కూడా ఒకరు. కాకపోతే వాక్ చాతుర్యం కలిగిన నేత. అలాంటి వ్యక్తిని జైలులో పెట్టి ఆయనకు ఫాలోయింగ్ తెప్పించారు.


వాస్తవానికి స్టీఫెన్ సన్ కి డబ్బులు ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డి కాదు. ఇతర టీడీపీ నాయకులు. కానీ హరీశ్ రావు ట్రాప్ చేయించి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నేరుగా ఇన్ వాల్వ్ అయ్యేలా చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టించారు. ఎందుకంటే అప్పటికే రేవంత్ రెడ్డి కేసీఆర్ ను తూర్పార పట్టడం ప్రారంభించారు. దీంతో కొంతమంది మాస్ ఓటర్ల చూపు ఆయనపై పడింది.


దీంతో ఆయన్ను రాజకీయంగా అణగదొక్కాలని కేసీఆర్ రేవంత్ రెడ్డిని జైలుకి పంపి టీడీపీని తెలంగాణలో లేకుండా చేశారు. దీంతో ప్రశాంతంగా ఉండొచ్చని భావించారు. కానీ అనూహ్యంగా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ పై దూకుడు పెంచడం, టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరడం చకచకా జరిగిపోయాయి. కాంగ్రెస్ కూడా ఆయన వాక్ చాతుర్యానికి ప్రాధాన్యం ఇస్తూ 2018 ఎన్నికల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది. 2023 ఎన్నికల కల్లా టీపీసీసీ చీఫ్ ని చేసింది. ఇప్పుడు ఆయనే కేసీఆర్ కు ప్రధాన ప్రత్యర్థి.  ఒక సాధారణ ఎమ్మెల్యేను పక్కలో బల్లెంలా కేసీఆర్ సృష్టించుకున్నారు.  ఒక్కమాటలో చెప్పాలంటే కేసీఆర్ తన శత్రువుని తానే సృష్టించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: