ఆరు నెలల క్రితం వరకూ కూడా పదో, పదిహేనో సీట్లు గెలిస్తే అన్నట్టుగా ఉండే కాంగ్రెస్‌ను రేవంత్ రెడ్డి ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ అంటేనే గ్రూపుల కుంపట్లుగా ఉండే నేతలను రేవంత్ రెడ్డి ఏకతాటిపైకి తీసుకొచ్చారు. అంతే కాదు.. ఒకరు ముందుకు లాగితే ముగ్గురు వెనక్కి లాగే కాంగ్రెస్ సీనియర్లను  రేవంత్ రెడ్డి బుజ్జగించారు. టికెట్ల కేటాయింపులోనూ  రేవంత్ రెడ్డి తనదైన ముద్ర చూపించారు. మిగిలిన నాయకులంతా తమ తమ నియోజక వర్గాల్లోనే ప్రచారానికి పరిమితం అయితే రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రమంతా తిరిగారు.


ఇక ఎన్నికల ప్రచారంలోనైతే సుడిగాలి ప్రచారమే చేశారు. 63 నియోజకవర్గాల్లో 87 సభల్లో రేవంత్ ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా నోటిఫికేషన్ నుంచి నుంచి ప్రచారం ముగిసే వరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దాదాపు 63 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. అక్టోబర్ 16న వికారాబాద్ లో నిర్వహించిన సభ నుంచి నవంబర్ 28న మాల్కాజిగిరి రోడ్ షోతో కలపుకొని దాదాపు 87 ప్రచార సభలో రేవంత్ రెడ్డి పాల్లొన్నారు.


వికారాబాద్, తాండూరు, పరిగి, చేవేళ్ల, ములుగు, భూపాలపల్లి, నిజామాబాద్ రూరల్, కొడంగల్, కామారెడ్డి, గజ్వేల్, దుబ్బాక, ఖైరతాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, అలంపూర్, గద్వాల, మక్తల్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జుక్కల్, ఆదిలాబాద్, ఖానాపూర్, నిర్మల్, బోథ్, డోర్నకల్, ఎల్ బీ నగర్, మహేశ్వరం, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, స్టేషన్ ఘన్ పూర్, పరకాల, వర్ధన్నపేట, జనగాం, పాలకుర్తి, మేడ్చల్, అంబర్ పేట, మెదక్, సంగారెడ్డి, మానకొండూరు, హుజురాబాద్, రాజేంద్రనగర్, సనత్ నగర్, సికింద్రాబాద్, నర్సాపూర్, వనపర్తి, నారాయణఖేడ్, ముషీరాబాద్, పఠాన్ చెరు, నారాయణపేట, నకిరేకల్, ఆలేరు, తుంగతుర్తి, రామగుండం, బెల్లంపల్లి, ధర్మపురి, మంథని, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, షాద్ నగర్, ఆర్మూర్ తదితర నియోజకవర్గాల్లో ప్రచారం రేవంత్ రెడ్డి  నిర్వహించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: