ఇప్పుడు తాజాగా ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు అధికార పార్టీలో కాకరేపుతోంది. ఒక వైపు ఎన్నికలకు సిద్ధం కావాలని చెబుతూనే మరోవైపు అభ్యర్థులను మార్చుతున్నారు. దీంతో సిట్టింగులు అసంతృప్తితో ఉన్నారు. పనితీరు సరిగా లేదని.. ప్రజల్లో అసంతృప్తి ఉందని కొందు మంత్రులను మార్చేయాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే 11 మందిని మార్చిన జగన్ రెండో జాబితా కూడా సిద్ధం చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు వైసీపీ అభ్యర్థుల మార్పు వివాదం రాజుకుంటోంది. ఎక్కిడికక్కడ నేతల అనుచరులు రోడ్డపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. హైకమాండ్ తీరును తప్పుపడుతున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విషయంలో జగన్ నిర్ణయాన్ని అక్కడి నాయకులు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్న మద్దాలి గిరిని తప్పించి మంత్రి విడుదల రజిని ని పార్టీ ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో మద్దాలి గిరి అనుచరులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
గురజాల అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని జంగా కృష్ణామూర్తి అక్కడి ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి ఎదురుగానే చెప్పారు. మరోవైపు మోపిదేవి అనుచరులు, జగ్గంపేట నియోజకవర్గంలో కొన్ని సమస్యలు ఇంకా ఈ తరహా ఘటనలతో జగన్ ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే జగన్ వీటన్నింటిని లెక్క చేసే పరిస్థితుల్లో లేరన్నట్లుగా అర్థం అవుతుంది. మొండిగా ముందుకు వెళ్తున్నారు. ఏది ఏమైనా తన పేరుతోనే ఈ సారి ఎన్నికలకు వెళ్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి