అందర్నీ లక్షాధికారులు, కోటీశ్వరులన్నీ చేయాలి ఇది టీడీపీ అధినేత చంద్రబాబు తాజా లక్ష్యం.  ఇవన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబుకి గుర్తుకు వస్తాయా.. అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆలోచనలన్నీ ఎటు వెళ్తాయో అనేది విమర్శకుల మాట. దాదాపు 14ఏళ్లు పాటు ఏపీని సీఎం చంద్రబాబు పరిపాలించారు.  ఆ సమయంలో ఎందుకు ప్రజలను సంపన్నులను చేయలేకపోయారు.


అసలు ఎలా చేస్తారు. ఇది ఒక అర్థరహిత స్టేట్ మెంట్ అని విమర్శకులు కొట్టి పారేస్తున్నారు. అయితే  తాను ఏది చెప్పినా నమ్మే స్థితిలో ప్రజలు ఉన్నారనే భ్రమలో చంద్రబాబు ఉన్నారేమో అనిపిస్తోంది.  తాజాగా కుప్పం పర్యటన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. జగన్ మోసపూరిత నవరత్నాలు ఇస్తున్నారని విరుచుకుపడ్డారు.  తాము అధికారంలోకి వస్తే 10లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి చేసే పాడి పరిశ్రమను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. సూపర్ సిక్స్ అమలయ్యేలా చూస్తానని మాటిస్తున్నానన్నారు.


ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి రూ.15వేలు ఇస్తామన్నారు.  ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగ భృతి, ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పన తనదేనని మాటిచ్చారు. మరోవైపు ఇవే హామీలు ఇచ్చిన వైసీపీని మాత్రం విమర్శిస్తుంటారు. రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని భయపెడుతుంటారు. మరి వైసీపీని మించి హామీలు ఇస్తే రాష్ట్రం దివాళా తీయదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.


సంపద ఎలా సృష్టించాలో.. తద్వారా ప్రజల ఆర్థిక స్థితి గతులు ఎలా పెంచాలో నేర్పించింది తానేనని చంద్రబాబు చెప్పుకుంటున్నారు.  అలాంటప్పుడు  2014-19మధ్య సంపద ఎందుకు సృష్టించలేకపోయారు. సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ ఎందుకు చేయలేకపోయారు. సంపద సృష్టించకపోవడం వల్లే అని పలువురు విమర్శిస్తున్నారు. సంపద సృష్టించే సత్తా ఉంటే అప్పులు రూ.2.5లక్షల కోట్లు ఎందుకు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.  అధికారంలో ఉన్నప్పుడు సృష్టించలేని సంపద.. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మళ్లీ గుర్తుకువచ్చిందని ఇది ఎలా సాధ్యమని ఇప్పటికైనా చంద్రబాబు తన విధానాన్ని మార్చుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: